AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైటెన్షన్: విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు.. అసలేం జరిగిందంటే

విశాఖపట్నం నుండి హౌరా వెళ్తున్న HPCL గ్యాస్ గూడ్స్ రైలు శ్రీకాకుళం జిల్లా తిలారు వద్ద లీక్ అయ్యింది. సిబ్బంది సకాలంలో గుర్తించి, రైలును నిలుపుదల చేశారు. రైల్వే, పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మరమ్మత్తులు చేపట్టారు. అధికారుల సమన్వయంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

హైటెన్షన్: విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు.. అసలేం జరిగిందంటే
Gas Tanker Train Stopped
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Mar 04, 2026 | 8:30 AM

Share

అధికార యంత్రాంగం అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. HPCL గ్యాస్ ను తరలిస్తున్న గూడ్స్ రైలు లోని ఓ వ్యాగిన్ నుండి గ్యాస్ లీక్ అయింది. అయితే దానిని సకాలంలో గుర్తించిన అధికారులు రైలును నిలుపుదల చేసి మరమ్మత్తులు చేపట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటన శ్రీకాకుళంలో చోటు చేసుకుంది.

విశాఖపట్నం లోని HPCL రిఫైనరీ సెంటర్ లో HPCL గ్యాస్ ను లోడ్ చేసుకుని ఓ గూడ్స్ రైలు హౌరా వైపుకు వెళుతుండగా శ్రీకాకుళo జిల్లా ఉర్లాం వద్ద రైలులోని ఓ వ్యాగిన్ నుండి గ్యాస్ లీక్ అవుతున్నట్టు సిబ్బంది గుర్తించారు. అయితే రైలును శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తిలారు రైల్వే స్టేషన్ కు తరలించి అక్కడ నిలిపివేశారు. వెంటనే రైల్వే, పోలీస్, రెవెన్యూ,అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

రైల్ ఇంజన్ నుండి 16వ వ్యాగిన్ కి పై భాగంలో లీక్ ను గుర్తించారు. ఆ వ్యాగిన్ కి వెనుక ఉన్న బోగీలను తప్పించి కొంత ముందుకు ట్రైన్ ను తీసుకువెళ్ళారు. అక్కడ కాసేపు విద్యుత్ సరఫరా నిలిపివేసి వ్యాగిన్ లీకేజీని బాగు చేశారు. అనంతరం నాణ్యత ప్రమాణాలను పూర్తి స్థాయిలో పరిసీలించాక తిరిగి రైలు బయలుదేరింది. సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గూడ్స్ రైలు తిలారు రైల్వే స్టేషన్ వద్ద చాలా సేపు నిలిచిపోవడంతో అటుగా ప్రయాణించే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..