Chandrababu Naidu: సొంత పనులు చక్కచెట్టుకోవడానికే ఢిల్లీ వెళ్లారు.. సీఎం జగన్‌పై మండిపడ్డ చంద్రబాబు..

సొంత పనులు చక్కబెట్టుకోవడం కోసమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కేంద్రం దగ్గర మెడలు వంచుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు

Chandrababu Naidu: సొంత పనులు చక్కచెట్టుకోవడానికే ఢిల్లీ వెళ్లారు.. సీఎం జగన్‌పై మండిపడ్డ చంద్రబాబు..
Chandrababu Naidu
Follow us

|

Updated on: Jan 05, 2022 | 9:46 PM

సొంత పనులు చక్కబెట్టుకోవడం కోసమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కేంద్రం దగ్గర మెడలు వంచుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. అందుకే ఢిల్లీ పర్యటనలకు వెళుతున్నారని, వీటితో ఆయనకు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని చంద్రబాబు తెలిపారు. మంగళవారం అమరావతిలో జరిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో టీడీపీ అధినేత పాల్గొన్నారు. తప్పుడు కేసులపై తాము అధికారంలోకి వచ్చాక పూర్తిగా సమీక్షిస్తామని, వాటిపై ఒక కమిషన్‌ వేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జగన్ ను నమ్ముకుంటే తప్పులు చేసే అధికారులు జైలుకు వెళ్లక తప్పదని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు

‘దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడినా ఏపీ లింక్ లు ఉంటున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనమే కారణం. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారు.. రేపు మళ్లీ పెంచబోతున్నారు. దేశంలో ఎక్కడా లేని పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఇచ్చామని మంత్రులు, ఎమ్మెల్యేలు ఊదరగొడుతున్నారు. ఎవరికి ఏమేమి ఇచ్చారో వివరాలు చెప్పండి. సంక్షేమ పథకాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయండి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా ధనాన్ని లూఠీ చేస్తున్నారు. జేబులు నింపుకుంటున్నారు. నిన్న ఢిల్లీకి వెళ్లిన జగన్‌ ఏం సాధించారో చెప్పాలి. ఇప్పటికే ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్‌ ప్లాంట్‌ హామీలు అటకెక్కించారు. మీ సొంత పనులు కోసం కేంద్రం దగ్గర మెడలు వంచారు. ఇక వారంలో సీపీఎస్ రద్దు అన్నావు. ఈ హామీల సంగతేంటి అని అడిగితే ఒకరు (సజ్జల రామకృష్ణా రెడ్డి) మాకు అవగాహన లేదని తప్పించుకుంటున్నారు. నేను తప్పుడు మాటలు ఎప్పుడూ చెప్పలేదు.. ఇచ్చిన మాట తప్పలేదు’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు చంద్రబాబు.

Also Read:

Coronavirus: కరోనా కట్టడికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రేపటి నుంచి నైట్‌ కర్ఫ్యూతో పాటు..

Coronavirus: తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా.. భారీగా పెరిగిన కొత్త కేసులు.. 24 గంటల్లో ఎంతమంది ఈ మహమ్మారి బారిన పడ్డారంటే..

Coronavirus: ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.