Andhra News: అయ్యో దేవుడా.. ఉదయాన్నే ఎంత ఘోరం జరిగింది.. స్కూల్‌బస్ డ్రైవర్ నిర్లక్ష్యానికి..
స్కూల్ బస్సు వచ్చింది.. ఎప్పటిలాగే.. విద్యార్థులంతా బస్సెక్కి స్కూల్ కు బయలు దేరారు.. మార్గ మధ్యలో బస్ రేడియేటర్‌లో నీళ్లు అయిపోవడంతో.. డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు.. రేడియేటర్ చెక్ చేసి.. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పిలిచి నీళ్లు తేవాలంటూ పక్కే ఉన్న కుంట దగ్గరికి పంపించాడు.. అయితే.. ఆ విద్యార్థి డబ్బా తీసుకుని.. పొలంలో ఉన్న కుంట దగ్గరికి వెళ్లాడు.
స్కూల్ బస్సు వచ్చింది.. ఎప్పటిలాగే.. విద్యార్థులంతా బస్సెక్కి స్కూల్ కు బయలు దేరారు.. మార్గ మధ్యలో బస్ రేడియేటర్‌లో నీళ్లు అయిపోవడంతో.. డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు.. రేడియేటర్ చెక్ చేసి.. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పిలిచి నీళ్లు తేవాలంటూ పక్కే ఉన్న కుంట దగ్గరికి పంపించాడు.. అయితే.. ఆ విద్యార్థి డబ్బా తీసుకుని.. పొలంలో ఉన్న కుంట దగ్గరికి వెళ్లాడు.. అక్కడ డబ్బాలో నీళ్లు నింపుతూ విద్యార్థి కుంటలో జారి పడ్డాడు.. ఈత రాకపోవడంతో కేకలు వేస్తూ నీళ్లలో మునిగిపోయాడు.. దీంతో అతన్ని కాపాడటానికి బస్సు క్లీనర్ అక్కడికి వెళ్లాడు.. అతనికి కూడా ఈత రాకపోవడం కుంటలోని నీటిలో మునిగిపోయాడు.. చూస్తుండగానే.. నిమిషాల వ్యవధిలో ఇద్దరూ (విద్యార్థి, బస్సు క్లీనర్) కుంటలోని నీటిలో మునిగి చనిపోయారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటుచేసుకుంది.
స్కూల్‌బస్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు మృతి చెందిన ఘటన దాచేపల్లిలో చోటుచేసుకుంది.. బస్ రేడియేటర్‌లో నీళ్లు అయిపోవడంతో.. రోడ్డు పక్కన నర్సరీలోని ఉన్న కుంట నుంచి నీళ్లు తెమ్మని డ్రైవర్ 5వ తరగతి బాలుడికి చెప్పాడు. దీంతో.. నీళ్లు తేవడానికి వెళ్లి 5వ తరగతి బాలుడు అందులో పడి చనిపోయాడు.. బాలుడిని కాపాడేందుకు వెళ్లి క్లీనర్ కూడా ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.
ఉదయాన్నే స్కూల్ కి వెళ్తుండగా..
నీళ్లలో పడి చనిపోయిన బాలుడు సుభాష్‌ది పులిపాడు గ్రామం.. దాచేపల్లి శ్రీచైతన్య స్కూల్‌లో చదువుతున్నాడు.. ఎప్పటిలాగే ఉదయాన్నే స్కూల్ కు బయలుదేరాడు.. బస్సు స్కూల్‌కి వెళ్తున్న సమయంలో రేడియేటర్‌లో నీళ్లు లేక ఆగిపోయింది.. దీంతో.. డ్రైవర్ నీళ్లు తేవాలని చెప్పడంతో సుభాష్ బస్సు దిగి రోడ్డు పక్కన ఉన్న నర్సరీలోని నీటి కుంట దగ్గరకు వెళ్లాడు..లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తూ బాలుడు అందులో పడి చనిపోయాడు.. ఇది చూసి సుభాష్‌ను కాపాడేందుకు వెళ్లిన క్లీనర్ కూడా మునిగిపోయాడు.. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు.. ఈఘటనతో ఒక్కసారిగా విషాదం నెలకొంది.. ఇరువురి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..