Andhra Pradesh: విశాఖ సౌత్ వైసీపీలో పీక్స్‌కు చేరిన వర్గపోరు.. రెబల్ ఎమ్మెల్యే ఎంట్రీతో..
Andhra Pradesh: విశాఖ సౌత్‌లో ఫ్యాన్ పార్టీ నేతల మధ్య వర్గపోరు పీక్ స్టేజికి వెళ్లింది. ప్లీనరీ సమావేశానికి ఏకంగా 8 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం..
Andhra Pradesh: విశాఖ సౌత్‌లో ఫ్యాన్ పార్టీ నేతల మధ్య వర్గపోరు పీక్ స్టేజికి వెళ్లింది. ప్లీనరీ సమావేశానికి ఏకంగా 8 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం ఇప్పడు హాట్ టాపిక్. అవును విశాఖ సౌత్ నియోజకవర్గంలో MLA వాసుపల్లి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గ YCP ప్లీనరీ సమావేశం వేదికగా మరోసారి గ్రూపు రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ప్లీనరీకి ఏకంగా 8మ౦ది కార్పొరేటర్లతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరు కాకపోవడం.. తీవ్ర చర్చనీయాంశమైంది. బీచ్ రోడ్డులోని YSR విగ్రహానికి నివాళులర్పి౦చిన కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేయడం.. ప్లీనరీకి డుమ్మా కొట్టడంతో విశాఖ రాజకీయాలు హీటెక్కాయి. ప్లీనరీకి కేవలం ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే హాజరవ్వట౦పై MLA వాసుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సమావేశానికి తమకు ఆహ్వానం లేదంటోంది బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ వర్గం.
టీడీపీలో గెలిచి వైసీపీ పంచన చేరిన రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి ఎంట్రీతో ఇక్కడ పాలిటిక్స్ హీటెక్కడం మొదలైంది. ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్య నాయకులతో.. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ల మధ్య మొదటి నుంచీ సఖ్యత కరువైంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం సీతంరాజు సుధాకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న వర్గాలను ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు మింగుడు పడటం లేదట. సొంత పార్టీలో వర్గ పోరు పడలేని ఎమ్మెల్యే గణేశ్.. ఇటీవలే రాజీనామా అస్త్రం సంధించారు. అనధికారికంగా చేపట్టిన కోఆర్డినేటర్ పదవిని వదులు కుంటున్నట్టు ఆయన ప్రకటించడం కలకలంగా మారింది. ఏకంగా వైవీ సుబ్బారెడ్డిని కోట్ చేస్తూ ఆయనకే రాజీనామా లేఖను పంపారు. ఇప్పుడు తాజా గొడవ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.