Strange Sounds: చిత్తూరు జిల్లాలో హడలెత్తిస్తున్న వింత శబ్దాలు.. వరుస ప్రకంపనలతో జనం పరుగులు..
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా మరోసారి రామకుప్పం మండలంలో భూ ప్రకంపనలు సంభవించడంతో జనం పరుగులు తీశారు. మండలంలోని
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా మరోసారి రామకుప్పం మండలంలో భూ ప్రకంపనలు సంభవించడంతో జనం పరుగులు తీశారు. మండలంలోని గడ్డూరు, చిన్నగరిగేపల్లి, ఎస్.గొల్లపల్లి, గొరివిమాకులపల్లిలో వరుస భూ ప్రకంపనలు అలజడి రేపుతున్నాయి. రాత్రి నుంచి వింత శబ్ధాలతో రావడంతో భయంతో జనం పరుగులు పెట్టారు. వరుస ప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. లోకల్ క్వారీల వల్లే ఈ శబ్దాలు వస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. భయంతో అర్ధరాత్రి నంచి జాగరం చేస్తున్నట్లు పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే జిల్లాలో పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే.. కొన్ని రోజుల క్రితం అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో మదిరేబైలు గ్రామంలో కూడా వింతశబ్దాలు భయాందోళనకు గురిచేశాయి. ఏక్షణాన ఏం జరుగుతుందోనంటూ స్థానికులు భయాందోళన చెందారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఆకాశం నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు రావడం, భూమి బద్దలైనట్లుగా.. భూమి కంపించడం వంటి ధ్వనులతో అంతా హడలఎత్తిపోయారు.
Also Read: