AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం.. యువతి, యువకుడు మృతి..

Visakhapatnam Road Accident: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువతి, యువకుడు మృతిచెందారు. బైక్ పై వెళుతుండగా

Visakhapatnam: తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం.. యువతి, యువకుడు మృతి..
Road Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Dec 08, 2021 | 9:15 AM

Share

Visakhapatnam Road Accident: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువతి, యువకుడు మృతిచెందారు. బైక్ పై వెళుతుండగా తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగింది. బైక్ అదుపు తప్పి ఢీవైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందడగా.. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. మృతులను జయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన సెలూన్ బాయ్ ప్రశాంత్‌ (22), మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థినిగా (17)గా గుర్తించారు. ప్రశాంత్ యువతితో కలిసి బైక్‌పై మంగళవారం సాయంత్రం ఆశీల్ మెట్ట నుండి కంచరపాలెం వైపు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని.. ఆమె చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

మరో ప్రమాదం.. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై మరో ప్రమాదం కూడా చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న కారును మరో కారు ఢికొట్టింది. ఈ ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. మద్యం మత్తులో యువకుడు కారు డ్రైవ్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు సంఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Andhra Pradesh: ఎంపీడీవోను దూషించిన వైసీపీ నాయకుడు అరెస్ట్.. మరో ముగ్గురిపై కేసు..

Musheerabad water tank: అసాంఘిక కలాపాలకు అడ్డాగా వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతం.. డెడ్‌ బాడీతో వెలుగులోకి కొత్త కోణాలు

Follow Us
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
అమరావతిలో కొత్త జోష్.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఆల్ మిక్స్ ఆవకాయ పచ్చడి.. పొలాల్లో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
ఒకే ఓవర్‌లో 39 పరుగులు.. యూవీ రికార్డును బ్రేక్ చేసిన అనామకుడు..!
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
పెళ్లి తప్పనిసరా? గరుడ పురాణం షాకింగ్ సమాధానం!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
మే నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే.. మీ రాశి ఉందా మరి!
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?
చంపకుండా మీ కిచెన్‌లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా?
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
టాక్సిక్ సినిమాలో అలాంటి సీన్స్.. డైరెక్టర్ పై యశ్ ప్రశంసలు..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..
మీ ఫోన్ సూపర్ ఫాస్ట్‌గా పనిచేయాలా.. వారానికి ఒక్క నిమిషం ఇలా..