Musheerabad water tank: అసాంఘిక కలాపాలకు అడ్డాగా వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతం.. డెడ్‌ బాడీతో వెలుగులోకి కొత్త కోణాలు

Musheerabad water tank: హైదరాబాద్‌ ముషీరాబాద్ పరిధిలోని రిసాలగడ్డ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన స్టేజలో దొరికిన డెడ్ బాడీ ఒక్కసారిగా అందర్నీ ఉలిక్కి పడేలా చేసింది. దాదాపు ఆ శవం నీళ్లలో

Musheerabad water tank: అసాంఘిక కలాపాలకు అడ్డాగా వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతం.. డెడ్‌ బాడీతో వెలుగులోకి కొత్త కోణాలు
Musheerabad Water Tank
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 08, 2021 | 11:54 AM

Musheerabad water tank: హైదరాబాద్‌ ముషీరాబాద్ పరిధిలోని రిసాలగడ్డ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన స్టేజలో దొరికిన డెడ్ బాడీ ఒక్కసారిగా అందర్నీ ఉలిక్కి పడేలా చేసింది. దాదాపు ఆ శవం నీళ్లలో 40-50 రోజుల క్రితమే పడి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే కొన్ని వేల కుటుంబాలు గత కొద్ది వారాలుగా డెడ్ బాడీ కుళ్లుతున్న నీటిని తాగుతున్నారు. అసలు ఆ వాటర్ ఇక్కడికి ఎక్కడినుంచి సప్లై అవుతుంది, ఇక డెడ్ బాడీ వాటర్ ట్యాంక్ లో ఎలా ప్రత్యక్షమైంది దానిపై టీవీ9 నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్‌లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరం నడిబొడ్డున ముషీరాబాద్ పరిధిలో కొన్ని వేల కుటుంబాలు కుళ్లిన శవం పడిన నీటినే మంచి నీరు తాగుతూ వచ్చారు. శివస్థాన్ పూర్, ఎస్ఆర్కె నగర్, పద్మశాలి సంఘం, హరినగర్ కాలనీలకు ఈ ట్యాంకర్ నుంచే డ్రింకింగ్ వాటర్ సప్లై జరుగుతుంది. రిసాలగడ్డ వాటర్ ట్యాంకికి కూడా ఇక్కడి నుంచే నీరు సరఫరా అవుతుంది.

1980లో మొదటగా 100 కుటుంబాలతో ప్రారంభమైంది. ఎస్ ఆర్ కె కాలనీ అయితే సొసైటీకి చెందిన 600 గజాల స్థలాన్ని కాలనీ అవసరార్థం వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కేటాయించారు. 1985-90 ఈ మధ్యకాలంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ పూర్తిగా మెయింటెన్ లేకపోవడంతో ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని టీవీ9 గ్రౌండ్‌ రిపోర్ట్‌లో తేటతెల్లమైంది. నిత్యం యువకులు మద్యం సేవించడం, సిగరెట్, గంజాయి ఇతర మత్తుపదార్థాలను తాగడానికి, స్త్రీ పురుషులు కలిసి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అడ్డాగా మార్చుకున్నారు. పలుమార్లు దీనిపై కాలనీవాసులు కంప్లైంట్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

అయితే.. దాదాపు నెలన్నరపైనే ఆ శవం ఆ నీటిలో నానుతోందని, ఆ నీటినే తాము తాగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వెంట్రుకలు బాగా నానిన చిన్న చిన్న మాంసపు ముక్కలు మంచినీళ్లలో వచ్చాయని బస్తీ వాసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే రిసాలగడ్డ వాటర్ ట్యాంక్ వద్ద పూర్తిగా మెయింటెనెన్స్ లేకుండానే డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

Also Read:

AP: ఏపీ ప్రభుత్వానికి ఏ బ్యాంకులో ఎన్ని అప్పులు.. రాజ్యసభలో వివరాలు వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి

Train Theft: నకిలీ ఆధార్ కార్డులతో రైలు ప్రయాణం.. రూ. లక్షలు విలువ చేసే బంగారం చోరీ.. చివరికి ఏమైందంటే..