AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: చీకటి గది, చుట్టూ పందికొక్కులు.. మా అమ్మను అలా వదిలేస్తారా సార్.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

ఒక వ్యక్తి బతికినంత కాలం ఎలా ఉన్నా.. అతను చనిపోయాడు అని తెలిస్తే మాత్రం పాపం అని అంటాం.. అతని గురించి కాసేపయిన కాస్త గౌరవంగా మాట్లాడుకుంటాం.. కుటుంబ సభ్యులు సైతం బతికినంత కాలం అతను ఎలా బతికినా.. కనీసం అంతిమ యాత్ర అయిన ఘనంగా చేయాలని భావిస్తారు.

Andhra: చీకటి గది, చుట్టూ పందికొక్కులు.. మా అమ్మను అలా వదిలేస్తారా సార్.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
Narsannapeta Chc
S Srinivasa Rao
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 15, 2025 | 1:28 PM

Share

ఒక వ్యక్తి బతికినంత కాలం ఎలా ఉన్నా.. అతను చనిపోయాడు అని తెలిస్తే మాత్రం పాపం అని అంటాం.. అతని గురించి కాసేపయిన కాస్త గౌరవంగా మాట్లాడుకుంటాం.. కుటుంబ సభ్యులు సైతం బతికినంత కాలం అతను ఎలా బతికినా.. కనీసం అంతిమ యాత్ర అయిన ఘనంగా చేయాలని భావిస్తారు. అందులో ఏ లోటు లేకుండా సంప్రదాయ బద్దంగా వీడ్కోలు పలుకుతారు. అయినవారంతా చివరి చూపు చూసుకుంటారు. కొందరయితే ప్రమాదంలో తమ వారు మృతి చెందితే చట్టప్రకారం.. మృతదేహానికి పోస్టు మార్టం చేయాల్సి ఉండగా డెడ్ బాడీ శరీర భాగాలు కట్ చేయటం ఇష్టం లేక పోస్టుమార్టం చేయడానికి అంగీకరించరు. కానీ కొందరు అధికారులకు, వైద్యులకు మాత్రం ఇవేవీ పట్టవు. మన సెంటిమెంట్ లతో వారికి పని ఉండదు.. అడుగడుగున నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ.. బాధితుల మనోభావాలతో ఆడుకుంటారు. అందుకు నిదర్శనమే శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పనితీరు. ఇక్కడి మార్చురి రూమ్ లో కనీస వసతులు లేవు.. పైగా ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం పలువురికి శాపంగా మారింది.

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామస్తులు శ్రీముఖలింగం దైవదర్శనానికి ఆటోలో వెళుతూ ఉండగా అచ్యుతాపురం వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గట్టెమ అచ్చెయ్యమ్మ(52), పద్మావతి(42) మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసన్న పేట CHC కి తరలించారు. అయితే అప్పటికే సాయంత్రం అయిపోవటంతో మరుసటి రోజు ఉదయం పోస్టుమార్టం చేసి పార్థివదేహాన్ని అందజేస్తామని అధికారులు కుటుంబసభ్యులకు చెప్పారు.

ఈ నేపథ్యంలో తన తల్లి అయిన అచ్చెయ్యమ్మను చూడడానికి వచ్చిన ఆమె కుమారుడు తల్లి మృతదేహం మార్చురీలో చీకటి గదిలో ఉండడం చూసి చలించిపోయాడు. ఆ పరిసర ప్రాంతాలలో పందికొక్కులు తిరుగుతుండంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామా.. నా తల్లిని చీకటి గదిలో పెట్టారు. పందికొక్కులు తిరుగుతున్నవి, హాస్పిటల్ చుట్టూ అపరిశుభ్రతంగా ఉంది అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. తన తల్లిని భద్రం చేసుకోవడానికి ఫ్రీజర్ ను సైతం తెచ్చానని కానీ హాస్పిటల్ సిబ్బంది తాళాలు తెరవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ హస్పిటల్ పరిసర ప్రాంతాలను చూపించి రోదించాడు.

వీడియో చూడండి..

ఈ సంఘటన అక్కడ ఉన్న వారిని తీవ్ర అవేదనకు గురిచేసింది. చనిపోయిన తన తల్లి దీనస్థితిని చూసి ఆ కుమారుడు ఆవేదన అక్కడ ఉన్న వారిని కూడా కంటతడి పెట్టించింది. అటు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అంతంత మాత్రమే ఉంటుందని.. ఇప్పుడు చనిపోయిన వారి పరిస్థితి కూడా అలాగే ఉందని తెల్లవారేసరికి తన తల్లి శరీర భాగాలను పందికొక్కులు కొరుకు తింటాయని ఆవేదన వ్యక్తం చేశాడు కుమారుడు.. ఇకనైనా అధికారులు స్పందించి.. చర్యలు తీసుకోవాలని కోరాడు.. తన తల్లికి జరిగిన విధంగా మరెవరికి జరగకూడదని రోదించాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు