Andhra: పేర్చిన వస్తువులు టకటకా పడిపోతున్నాయ్.! తొంగి చూస్తే హడల్..
విశాఖలోని నేవల్ క్యాంటీన్.. నేవీ ఉద్యోగులు అధికారులంతా అక్కడ నుంచే నిత్యావసరాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజు మాదిరిగానే ఉదయాన్నే క్యాంటీన్ తలుపుల విప్పిన సిబ్బంది లోపలికి వెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఓ ఉద్యోగికి శబ్దం వినిపించింది.

విశాఖలోని నేవల్ క్యాంటీన్.. నేవీ ఉద్యోగులు అధికారులంతా అక్కడ నుంచే నిత్యావసరాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజు మాదిరిగానే ఉదయాన్నే క్యాంటీన్ తలుపుల విప్పిన సిబ్బంది లోపలికి వెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఓ ఉద్యోగికి శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే.. అక్కడ రేక్‌లో పేర్చిన వస్తువులు ఒక్కొక్కటిగా కింద పడుతున్నాయి. కిందపడిన వాటిని తీసి మళ్ళీ పేర్చిన క్రమంలో పెడుతుండగా.. ఏదో కదిలినట్టు అనిపించింది. కాస్త లోపలకు తొంగి చూస్తే.. గుండె ఆగే పని అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. ఆరడుగుల పొడవు.
సింధియా నేవల్ క్యాంటీన్లో సిబ్బంది హడలెత్తిపోయారు. వస్తువుల మాటున కదులుతున్న భారీ పామును చూశారు. దీంతో గుండెలు పట్టుకున్న సిబ్బంది వెంటనే స్నేక్ కేచర్ నాగరాజుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన నాగరాజు… ఆరడుగుల పొడవున్న పామును చాకచక్యంగా రెస్క్యూ చేశాడు. నాగరాజు వచ్చి ఆ పామును పట్టుకునే వరకు అందరూ హడలెత్తిపోయారు. పామును బంధించేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అది ర్యాట్ స్నేక్..
నేవల్ క్యాంటీన్లో సిబ్బందిని భయపెట్టిన పాము ర్యాట్ స్నేక్. విష రహిత సర్పం. ఈ పాము సుమారు 10-12 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. ఎలుకలు, కప్పలు, చిన్న చిన్న పక్షులను ఆహారంగా తింటుంది. వ్యవసాయ క్షేత్రాల్లో ఎక్కువగా సంచరిస్తూ.. అక్కడ ఎలుకలను వేటాడి తింటుంది. పంటలకు ఎలుకల బారి నుంచి రక్షిస్తుంది. అందుకే ఈ పాములను రైతు నేస్తం అని కూడా అంటారు. అంతేకాదు ఎలుకల సంతతి పెరగకుండా చేస్తుంది. పర్యావరణ సమతుల్యత పరిరక్షిస్తుంది. ఈ పాములను నాగ జెర్రి, జెర్రిపోతు కూడా అంటారు. పొడవుగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఊపిరి తీసుకొని శబ్దాలు చేస్తాయి. దీంతో ప్రజలు భయపడతారు. కానీ.. ఈ పాముల వల్ల మనుషులకు హాని జరగదు.
