Vizag: తొలిరోజు గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూకు అతిథులు ఫిదా.. శనివారం మరెన్నో ఐటెమ్స్

సమ్మిట్‌కు వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలు రెడీ చేశారు. వెజ్, నాన్‌వెజ్‌‌లో ఆంధ్రా స్పెషల్ వంటకాలు మెనూలో ఉన్నాయి.. అతిథులకు నోరూరించే పసందైన వంటకాలు రుచి చూస్తున్నారు.

Vizag: తొలిరోజు గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూకు అతిథులు ఫిదా.. శనివారం మరెన్నో ఐటెమ్స్
Non Veg Items
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 03, 2023 | 6:25 PM

అడ్వాంటేజ్ ఏపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు హాజరైన దేశ విదేశాల అతిరధ మహారధులకు తొలిరోజు నోరూరించే వంటకాలు వండి వడ్డించింది రాష్ట్ర ప్రభుత్వం. సమ్మిట్ అతిధులకు ఏపీ సంప్రదాయ వంటకాలను రుచి చూపారు. నోరూరించే వెజ్, నాన్‌వెజ్ కేటగరీ మెనూలు అందరినీ నోరూరించాయి.

తొలిరోజు కొన్ని రకాలు, రెండవ రోజు కొన్ని రకాలను వడ్డించాలని నిర్ణయించగా..  ఫస్ట్ డే మెనూ అందరినీ ఆకట్టుకోనుంది. తొలిరోజు మధ్యాహ్నం భోజనంలో.. బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్ కర్రీ, చికెన్ పలావ్ ఉంటే..వెజ్ రకంలో ఉలవ చారు, మష్రూం, క్యాప్సికం, ఆలూ గార్లిక్ ఫ్రై, క్యాబేజి మటర్ ఫ్రై, వెజ్ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్ బటర్ మసాలా, మెంతికూర-కార్న్ రైస్, మిర్చి సలాడ్, టొమాటో పప్పు, బీట్‌‌రూట్ రసం, మజ్జిగ పులుసు, గోభీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, ద్రాక్ష పండ్ల పచ్చడి, చల్ల మిర్చి ఉంటాయి. స్వీట్స్‌లో కట్ ఫ్రూట్స్, ఐస్ క్రీం, పేస్ట్రీ, కాలా జామున్, జున్నులను వడ్డించారు. అతిథులు లొట్టలేసుకుంటూ ఈ టేస్టీ వంటకాలను ఆరగించి.. ఏపీ సర్కార్ ఆతిథ్యానికి ఫిదా అయ్యారు.

శనివారం మెనూ ఇదే..

ఉదయం టిఫిన్.. ఇడ్లీ,  పొంగల్, వడ, టమాటా బాత్.. ఉదయం స్నాక్స్‌లో కేక్, డ్రై కేక్, మఫిన్స్, ప్లమ్‌ వెజ్‌ బుల్లెట్, స్ప్రింగ్‌ రోల్స్ ఉన్నాయి. మధ్యాహ్నం గోంగూర రొయ్యల కూర, చేప ఫ్రై, మటన్‌ పలావ్‌, ఆంధ్రా చికెన్‌ కర్రీ, ఎగ్‌ మసాలాలు నాన్ వెజ్ మెనూలో ఉన్నాయి. వెజ్‌‌ విషయానికి వస్తే…  వెజ్‌ బిర్యానీ, క్యారెట్‌ బీన్స్‌ కొబ్బరి ఫ్రై,  కరివేపాకు రైస్, కడాయ్‌ పన్నీర్ కూర, వంకాయ మెంతి కారం, బెండకాయ–జీడిపప్పు ఫ్రై, ఉలవచారు క్రీం, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు వంటివి ఉన్నాయి. డబుల్‌కా మీఠా, బ్రౌనీ,  అంగూర్‌ బాసుంది, గులాబ్‌జామ్, ఐస్‌క్రీం, కట్‌ ఫ్రూట్స్ మెనూలో ఉన్నాయి. బటర్‌ నాన్‌, రుమాలి రోటీ సైతం ఉన్నాయి. సాయంత్రం స్నాక్స్‌లో డ్రై ఫ్రూట్‌ కేక్, ఫ్రూట్‌ కేక్, కట్‌ మిర్చి బజ్జీలు, చీజ్‌ బాల్స్, కుకీస్, టీ, కాఫీలు మెనూలో చేర్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!