Andhra Pradesh: అలా హామీ ఇస్తే తప్ప తగ్గేదే లే.. ఉద్యమానికి సిద్ధమైన ఉద్యోగులు..
రాష్ట్రంలో ఈనెల 9వ తేది నుంచి ఉద్యోగుల ఉద్యమ కార్యచరణ ప్రారంభమవుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరు తెలిపారు. పిఆర్‌సి, అరియర్స్, ఇతర సమస్యలపై ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హమీ ఇస్తే..
రాష్ట్రంలో ఈనెల 9వ తేది నుంచి ఉద్యోగుల ఉద్యమ కార్యచరణ ప్రారంభమవుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరు తెలిపారు. పిఆర్‌సి, అరియర్స్, ఇతర సమస్యలపై ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హమీ ఇస్తే తప్ప తమ ఉద్యమాన్ని ఆపేదిలేదన్నారు. ఇదే విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి తేల్చిచెప్పామన్నారు. ఒంగోలులో ఏపీ జేఏసి అమరావతి ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్న బొప్పరాజు ఈనెల 9వ తేది నుంచి జరగనున్న ఉద్యామాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తామన్నారు.
ఇది ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమం కాదని, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తున్నామన్నారు. సకాలంలో జీతాలు రాక చాలామంది ఉద్యోగులు లోన్‌యాప్‌ల్లో అప్పులు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో డిఆర్‌డిఏ ఉద్యోగి జీతం లేక డయాలసిస్ చేయించుకోలేక చనిపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఇవ్వాల్సినదానికన్నా ఎక్కువ సమయం ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. సీఎంకు ఉన్న ఇబ్బందులు, కరోనా కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సహకరించామన్నారు. తామిచ్చిన సహకారాన్ని ప్రభుత్వం చులకనగా తీసుకుని చేతకానివారికింద జమ కట్టిందని ఆరోపించారు.
తమకు న్యాయంగా, చట్టబద్దంగా జీతాలు పెంచాల్సి ఉన్నా 11వ పీఆర్‌సీని అమలు చేయలేదన్నారు వెంకటేశ్వర్లు. అంతేకాకుండా 10 వ పీఆర్‌సీ రాయితీలను కూడా కట్ చేశారని వాపోయారు. ఇవ్వాల్సిన వాటిలో కోత విధించడం, జీతాలు పెంచకపోవడం, దాచుకున్న డబ్బులు కూడా పొందలేని పరిస్థితులను కల్పించినందునే ఉద్యమానికి సిద్దమయ్యామని స్పష్టం చేశారాయన. 11వ పీఆర్‌సీ అరియర్స్ కోసం నాలుగురోజుల క్రితం ఇచ్చిన జీవోలో కూడా తాము రిటైర్ అయిన తరువాత ఇస్తారంటున్నారని, ఇది కుట్రకాదా? అని ప్రశ్నించారు. .. కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు లేవని, నిధులు లేవని, పైపెచ్చు ప్రజల్లో చులకన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో శ్రమదోపిడీ జరుగుతోందని ఆరోపించారు వెంకటేశ్వర్లు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..