AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SP Siddarth Koushal: నాటుసారా ఆనవాళ్లు ఎక్కడా కనిపించకూడదు.. ఎస్పీ సిద్ధార్థ్ కీలక ఆదేశాలు

నాటుసారా తయారీ నిర్మూలనకు చేపట్టవలసిన చర్యల గురించి కృష్ణా జిల్లా (Krishna District) ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ (SP Koushal) సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ, ఎస్ఈబీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటుసారా తయారీ...

SP Siddarth Koushal: నాటుసారా ఆనవాళ్లు ఎక్కడా కనిపించకూడదు.. ఎస్పీ సిద్ధార్థ్ కీలక ఆదేశాలు
Siddarth
Ganesh Mudavath
|

Updated on: Mar 18, 2022 | 9:20 PM

Share

నాటుసారా తయారీ నిర్మూలనకు చేపట్టవలసిన చర్యల గురించి కృష్ణా జిల్లా (Krishna District) ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ (SP Koushal) సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ, ఎస్ఈబీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటుసారా తయారీ ఆనవాళ్ళు జిల్లాలో కనపడకూడదని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. నాటుసారా తయారీ, అమ్మకం, రవాణాకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని సూచించారు. మారుమూల గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తూ, ఎంతో మంది జీవితాలను కాలరాస్తున్న నాటుసారా ఆనవాళ్లు జిల్లాలో ఏ మూలనా కనపడకూడదని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో నాటుసారా తయారీపై అధిక కేసులు నమోదవుతున్నాయో, ఆ ప్రాంతాల్లో ఎంత మంది తయారీదారులు ఉన్నది, అనే విషయాలను ఎస్పీ తెలుసుకున్నారు. అందులో భాగంగా నాటుసారా తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, రహస్యంగా నాటు సారా తయారు చేస్తున్న కేంద్రాలను గుర్తించి వాటిని ధ్వంసం చేయడమే కాకుండా అలాంటి ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో వాటన్నింటిపై నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు.

అక్రమ మార్గాల ద్వారా నాటు సారా రవాణా చేసే ప్రాంతాలను గుర్తించి, నిరంతర తనిఖీలు చేపట్టాలని, అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. కేవలం పోలీస్ స్టేషన్ లోనే కాకుండా ఎక్సైజ్ స్టేషన్ లలో కూడా నాటు సారా తయారీపై నమోదైన కేసులను గమనించి.. అధిక కేసుల్లో ఉన్న వారిపై సస్పెక్ట్ షీట్లు తెరవాలని అన్నారు. నాటు సారా తయారీని అరికట్టడంలో మనందరం భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. పోలీస్, ఎస్ఈబీ శాఖలు కలిసి సంయుక్తంగా నిరంతర దాడులు నిర్వహించాలని తెలిపారు. నాటు సారా కట్టడిలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవీ చదవండి

RCFL Recruitment: రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

Sushanth: నీలి కళ్లతో భయపెడుతున్న అక్కినేని యంగ్ హీరో.. రావణాసుర నుంచి లేటెస్ట్ పోస్టర్..

Income Tax: రికార్డు స్థాయిలో పెరిగిన పన్ను వసూళ్లు.. గతేడాది కంటే 48.41% ఎక్కువ..