Holi 2022: ఆ గిరిజన గ్రామంలో డిఫరెంట్ హోలీ..! ఎలా చేస్తారంటే..!
Holi 2022: విభిన్న సంస్కృతి సంప్రదాయాలు కనిపించే ఏజెన్సీ ప్రాంతంలో పండుగలు కూడా ప్రత్యేకతగానే ఉంటాయి. ఏ పండుగైనా గిరిజనులు
Holi 2022: విభిన్న సంస్కృతి సంప్రదాయాలు కనిపించే ఏజెన్సీ(Visakha Agency) ప్రాంతంలో పండుగలు కూడా ప్రత్యేకతగానే ఉంటాయి. ఏ పండుగైనా గిరిజనులు(Tribals) వారి స్టైల్లో నిర్వహించుకోవడానికి ఇష్టపడుతుంటారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని కచ్చితంగా పాటిస్తూ.. సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు ఆ గిరిజన గ్రామంలో సందడే సందడి. నలభై అడుగులకు పైగా కట్టెలు పేర్చి దానికి నిప్పంటిస్తారు. ఆనందోత్సహాలతో సంబరాలు చేసుకుంటారు. రంగుల పండుగ హోలీలో భోగిలాంటి ఈ కట్టెల నిప్పు సాంప్రదాయం ఏంటనేగా మీ ఆలోచన..? మరి దాని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
విశాఖ ఏజెన్సీలో ఏ పండుగనైనా కాస్త డిఫరెంట్‌గా చేసుకోవడం గిరిజనులకు ఆనవాయితీ. తమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను నిర్వహించుకుంటారు గిరిజనులు. ఇందులో భాగంగానే హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో హోలీ వేడుకల్లో గిరిజనులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం శుక్లపక్షం రోజున హోలీ పండుగ చేస్తారు ఇక్కడి గిరిజనులు. పౌర్ణమి రోజు ఉదయాన్నే ప్రత్యేక పూజ హోమం కార్యక్రమం నిర్వహిస్తారు.
తాజంగిలో గిరిజనులు ఈ పండుగను విభిన్న రీతిలో నిర్వహిస్తారు. 40 అడుగుల ఎత్తులో కట్టెలు పేర్చి.. దాని పై భాగంలో ఓ జెండా పెడతారు. హాలికి ముందు రోజు రాత్రి నుంచే ఇక్కడ సంబరాలు మొదలవుతాయి. ఈ సాంప్రదాయం ఒడిస్సాలో ఉన్నప్పటికీ.. తరాల క్రితం వలస వచ్చిన గిరిజనులంతా దాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహిస్తుంటారు. హోలీ రోజు వేకువజామున లేచి స్నానాలు ఆచరించి అంతా కుప్పగా పోసి ఉన్న హోలీ కట్టెల వద్దకు చేరుకుంటారు. ఆ తరువాత వేడుకగా కట్టెలు పెర్పుకు నిప్పుఅంటిస్తారు. అంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటారు.
జెండా ఎవరు అందుకుంటే అతడే హీరో.. దానికీ ఓ ప్రత్యేకత ఉండండోయ్..! భోగిమంటల్లా పేర్చిన కట్టెల కుప్పపై పెట్టే జండాకు ఓ ప్రత్యేకత ఉంది. కట్టెలు పూర్తిగా కాలుతున్న క్రమంలో.. కట్టెలపై చివర్లో ఏర్పాటుచేసిన జెండా కింద పడే సమయంలో దానిని పట్టుకునేందుకు గిరిజనులంతా పోటీపడతారు. ఎవరైతే జెండా కింద పడకుండా పట్టుకుంటారో వారిని గ్రామంలో ఘనంగా సత్కరించి.. ఊరెగించి.. బహుమతి అందజేస్తారు. ఈ ఆచారం తరతరాలుగా వస్తుందని అన్నారు పూజారి జగన్.
కట్టెలపై పెట్టిన జెండాకు మరో విశేషం కూడా ఉంది. జెండా ఎటు వైపు అయితే ఒరిగితే అటువైపు పాడి పంటలు పుష్కలంగా పండుతాయని ఇక్కడ గిరిజనుల విశ్వాసం నమ్మకం. ఒకవేళ ఆ జండా ఆ నిప్పులో పడి కాలిపోతే ఆ ఏడాది గ్రామానికి అరిష్టం వస్తుందనేది వారి విశ్వాసం. అందుకే జెండా కింద ఒరుగుతుండగానే అంతా పట్టుకునేందుకు పోటీపడతారని అంటున్నారు సర్పంచ్ వంతల మహేశ్వరి. ఇదీ ఏజెన్సీలో హోలీ పండుగ విశిష్టత. గిరిజనులు వేడుకగా నిర్వహించుకునే భోగి పండుగ లాంటి హోలీ పండుగ.
Also read: