Group Exams: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం.. పూర్తి వివరాలివే
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల (Group Posts) భర్తీకి ఆమోదం తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే...
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల (Group Posts) భర్తీకి ఆమోదం తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి అనుమతిచ్చారు. దీంతో గ్రూప్-1లో 110 పోస్టులు, గ్రూప్-2లో 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా త్వరలోనే ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్లు (Notifications) జారీ చేయనుంది. 2020లో నిర్వహించిన సమావేశంలో అప్పటికే మెయిన్స్ పరీక్షకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధుల్ని కొనసాగించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని అభ్యర్ధులు తాజాగా హైకోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 5 తప్పు ప్రశ్నల్ని సరిదిద్దిన తర్వాత కొత్తగా మెయిన్స్ కు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధుల జాబితా తయారు చేయాలని ఆదేశించిందని గుర్తుచేశారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయాల్సి ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. జులై నుంచి 2022 మార్చి వరకు 10 వేల 143 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనే వివరాలతో జాబ్ క్యాలెండర్విడుదల చేశారు.కిందటి ప్రభుత్వం 1.40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎగురగొట్టారన్న సీఎం జగన్… అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. 2 ఏళ్ల కాలంలోనే ఏకంగా 6 లక్షల 03 వేల 756 ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 22 వేల శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 50 ఇళ్లకు ఓ వాలంటీర్ చొప్పున కొత్త వ్యవస్థను తీసుకువచ్చామని, 2.50 లక్షలకుపైగా నిరుద్యోగులను వాలంటీర్లగా నియమించామని వివరించారు.
Also Read
Weight Loss: మీరు ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా.. అయితే ప్రమాదంలో ఉన్నట్లే..