AP Rains: ఆంధ్రాలోని ఈ ప్రాంతాలకు తేలికపాటి వర్షాలు.. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్..
ఏపీవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయని పేర్కొంది వాతావరణ శాఖ. అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు.. ఆ వివరాలు ఇలా..

ఏపీవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తున్నాయని పేర్కొంది వాతావరణ శాఖ. అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
గురువారం.. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇది చదవండి: చేపల వల బరువెక్కడంతో జాలర్లు సంబరపడ్డారు.. తీరా పైకి లాగి చూడగా.!
శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి కాకినాడ జిల్లా శంఖవరంలో 47.5మిమీ, పెద్దాపురంలో 46.2మిమీ,తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో 44.5మిమీ, మన్యం జిల్లా పాలకొండలో 39.5మిమీ, విజయనగరం జిల్లా సంతకవిటిలో 39మిమీ, రాజాంలో 37.7మిమీ, వేపాడలో 35.7మిమీ, తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడిలో 33.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.
ఇది చదవండి: చల్ల.. చల్లగా.! ఏపీలో వచ్చే 2 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




