Festival Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నేడు, రేపు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

South Central Railway: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులు రద్దీ దృష్ట్యా ఆది, సోమవారాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. పండుగకు

Festival Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నేడు, రేపు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..
Passenger Trains
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 17, 2021 | 8:50 AM

South Central Railway: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులు రద్దీ దృష్ట్యా ఆది, సోమవారాల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. పండుగకు ఊరెళ్లి తిరిగివచ్చే వారి కోసం 12 అన్‌ రిజర్వుడ్‌ రైళ్ల సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య ఉదయం 8.45 గంటలకు, విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించింది. ప్రయాణికులు గమనించగలరంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతోపాటు ఇక సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య ఉదయం 9.50 గంటలకు, నిజామాబాద్-సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్నం 2.55 గంటలకు, కాచిగూడ-కర్నూలు మధ్య ఉదయం 10 గంటలకు, కర్నూలు-కాచిగూడ మధ్య సాయంత్రం 4 గంటలకు అన్ రిజర్వుడ్ రైళ్లు నడుస్తాయి.

అదేవిధంగా.. సికింద్రాబాద్- మచిలిపట్నం,  మచిలిపట్నం – సికింద్రాబాద్,  కాజీపేట-భద్రాచలం, భద్రాచలం-కాజీపేట, కాజీపేట-హైదరాబాద్‌, సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడువనున్నట్లు తెలిపింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని స్పెషల్ రైళ్లను నడపనున్నారు.

Also Read:

Gold Price Today: గుడ్‌న్యూస్‌.. బంగారం ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Crime News: దారుణం.. ఐదేళ్లుగా బాలికపై అత్యాచారం.. తండ్రితో సహా ఎస్పీ, బీఎస్పీ నాయకుల అరెస్ట్..