Andhra Pradesh: దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం.. ఏపీలోని 23 రైల్వే స్టేషన్ల మూసివేత.. లిస్టు ఇదే
ఒకవైపు ఆదాయం తగ్గడం..ఇంకోవైపు నిర్ణీత స్టేషన్ నుండి కనీసం రోజుకు పాతికమంది కూడా రాకపోకలు సాగించని రైల్వే స్టేషన్లు మూసేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న 23 రైల్వే స్టేషన్లు మూతపడ్డాయి.
ఒకవైపు ఆదాయం తగ్గడం..ఇంకోవైపు నిర్ణీత స్టేషన్ నుండి కనీసం రోజుకు పాతికమంది కూడా రాకపోకలు సాగించని రైల్వే స్టేషన్లు మూసేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న 23 రైల్వే స్టేషన్లు మూతపడ్డాయి.రైల్ లో ప్రయాణికుల ప్రయాణ జాప్యం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైల్వే శాఖ సంచలన నిర్ణయంతో ఎన్టీఆర్,కృష్ణ ఉమ్మడి గోదావరి జిల్లాలలోని 23 రైల్వే స్టేషన్లు మూతపడ్డాయి.. అక్కడున్న రైల్వే సిబ్బందిని కూడా ఇతర చోట్లకు సర్దుబాటు కూడా చేశారు అధికారులు. వ్యక్తిగత వాహనాలు రవాణా సౌకర్యం ఉండడం.. రోడ్లు అందుబాటులోకి రావడంతో ప్యాసింజర్ రైళ్లకు ఆ స్టేషన్లో డిమాండ్ తగ్గింది.. మే 1 నుంచి జూన్ 1 వరకు విజయవాడ డివిజన్ పరిధిలోని 23 రైల్వే స్టేషన్లను డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు పరిశీలించి అధికారులు మూసేయాలని నిర్ణయించారు.
రైల్వే శాఖ మూసేసిన 23 స్టేషన్లో జాబితాలో విజయవాడ డివిజన్ పరిధిలోని NSG-6 సిక్స్ క్యాటగిరి లో ఉన్న 16 స్టేషన్లు మొన్న మే నెలలో మూతపడ్డాయి. ఈ జాబితాలో తేలప్రోలు, వట్లూరు,శ్రీ వెంకటేశ్వరపురం, తలమంచి,పెన్నాడ అగ్రహారం,తాడి, అల్లూరు రోడ్డు,ముస్తాబాద్,చాగల్లు, బయ్యవరం,నవాబు పాలెం,రావికంపాడు,పెద్దఔటుపల్లి, దెందులూరు, బాదంపూడి, హంసవరం రైల్వే స్టేషన్లను మూసివేస్తే జూలై 1 నుండి చింతపర్లు, కొలనుకొండ,బలబద్రపురం,వీరవల్లి,ఉంగుటూరు తిమ్మాపురం, బ్రాహ్మణగూడెం రైల్వే స్టేషన్లు ఎత్తేశారు. మూసేసిన రైల్వే స్టేషన్లలో ఇకపై విజయవాడ నుండి బయలుదేరే ప్యాసింజర్ రైళ్లు ఆదోని రైల్వే అధికారులు ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..