Special Trains: ఉభయ రాష్ట్రాల్లోని ఆ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు.. ఇవిగో పూర్తి వివరాలు
వరుస సెలవులు వస్తున్నాయి. దీంతో ప్రయాణీకులు సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని స్పెషల్ ట్రైన్ ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, కాకినాడ సహా పలు సిటీలు, పట్టణాల నుంచి ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఏయే రూట్స్‌లో ఈ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. టైమింగ్స్ ఏంటి వంటి వివరాలు తెలుసుకుందాం పదండి..

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. రైలు నెంబర్ 07071 (సికింద్రాబాద్-కాకినాడ టౌన్) సెప్టెంబర్ 2వ తేదీన సికింద్రాబాద్ నుండి రాత్రి 9:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. ట్రైన్ సంఖ్య 07072 (కాకినాడ సిటీ-సికింద్రాబాద్) సెప్టెంబర్ 03న కాకినాడ టౌన్ నుండి నైట్ 9 గంటలకు స్టార్టయ్యి తదుపరి రోజు ఉదయం 8:50 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. ఈ ట్రైన్‌కు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, మౌలా-అలీ స్టేషన్లలో స్టాప్స్ ఉన్నాయి. ఈ స్పెషల్ ట్రైన్స్‌లో AC ఫస్ట్ క్లాస్, 2A, 3A, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
పాసింజర్స్ రద్దీ అధికంగా ఉన్న క్రమంలో సికింద్రాబాద్ – రామంతాపురం( 07695) మధ్య నడిచే స్పెషల్ ట్రైన్‌ని పొడిగించింది సౌత్ సెంట్రల్ రైల్వే. సెప్టెంబర్ 06వ తారీఖు నుంచి 27వ తేదీ వరకు ఈ సర్వీసును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి బుధవారం తేదీల్లో ఈ రైలు సికింద్రాబాద్ నుంచి స్టార్టవుతుంది. ఇక రామంతాపురం నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే స్పెషల్ ట్రైన్ (07696)ను పొడిగించారు అధికారులు. ఈ రైలు సెప్టెంబర్ 08 నుంచి 29 తారీఖు వరకు నడుస్తుంది. ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక సర్వీసు అందుబాటులో ఉంటుంది.
ట్రైన్ నంబర్ 07068 మంత్రాలయం రోడ్ నుంచి మచిలీపట్నం వరకు సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రతీ బుధవారం, ఆదివారం ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రాలయంలో స్టార్టయ్యి.. తదుపరి రోజు ఉదయం 5.50 గంటలకు మచిలీపట్నం రీచ్ అవుతుంది. ట్రైన్ నంబర్ 07067 మచిలీపట్నం టూ మంత్రాలయం రోడ్ వరకు ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రతీ మంగళవారం, శనివారం ప్రత్యేక రైలు సర్వీసును ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. ఈ ట్రైన్ రాత్రి 8 గంటలకు మచిలీపట్నంలో స్టార్టయ్యి.. తదుపరి రోజు ఉదయం 7.05 గంటలకు మంత్రాలయం రోడ్ రీచ్ అవుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
