Prakasam District: కిడ్నాపర్లా..? పోలీసులా..? ఇంట్లోకి చొరబడి యువకుడి అపహరణ
రవి ఉన్నాడా... అంటూ ఇంట్లోకి వచ్చాడో యువకుడు. స్నేహితుడై ఉంటాడనుకుని లోపల ఉన్నాడని తెలిపింది రవి తల్లి లక్ష్మి. వెంటనే నలుగురు బలిష్టమైన యువకులు ఇంట్లోకి జొరబడ్డారు. రవితేజ అలియాస్ రవిని కొట్టుకుంటూ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న కారులో ఎక్కించుకుని పారిపోయారు. ఈ ఘటన ప్రకాశంజిల్లా చీరాలలో..

చీరాల, సెప్టెంబర్ 1: రవి ఉన్నాడా… అంటూ ఇంట్లోకి వచ్చాడో యువకుడు. స్నేహితుడై ఉంటాడనుకుని లోపల ఉన్నాడని తెలిపింది రవి తల్లి లక్ష్మి. వెంటనే నలుగురు బలిష్టమైన యువకులు ఇంట్లోకి జొరబడ్డారు. రవితేజ అలియాస్ రవిని కొట్టుకుంటూ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న కారులో ఎక్కించుకుని పారిపోయారు. ఈ ఘటన ప్రకాశంజిల్లా చీరాలలో కలకలం రేపింది. రవిని ఎత్తుకెళుతుండగా అడ్డుపడిన తల్లి లక్ష్మిని గట్టిగా హెచ్చరించిన గుర్తు తెలియని వ్యక్తులు తాము తెనాలి పోలీసులమని చెప్పడంతో ఏం చేయాలో అర్ధంకాని రవి తల్లి చీరాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులమంటూ ఇంట్లోకి చొరబడి ఓ యువకుడిని కారులో బలవంతంగా ఏక్కించుకోని తీసుకుపోయిన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో కలకలం రేపింది. పట్టణంలోని బంధవారి వీధిలో నివాసముంటున్న రవితేజ అనే యువకుని ఇంట్లోకి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి పోలీసులమంటూ బలవంతంగా కారులో తీసుకుపోయారు. ఇక ఈ ఘటన తో నివ్వెరపోయిన కుటుంబ సభ్యులు చీరాల 1 టౌన్ పోలీసులకు పిర్యాదు చేశారు. తెనాలి పోలీసులమంటూ తన కొడుకు ను కొట్టుకుంటూ కారులో ఏత్తుకుపోయారని రవితేజ తల్లి లక్ష్మీ ఫిర్యాదులో పేర్కొంది. రెండు సంవత్సరాల క్రితం బాధితుడు రవితేజ తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని మోసగించాడనే కేసులో అతని వ్యాపార భాగస్వాములు ఇచ్చిన ఫిర్యాదుతో చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసును కోర్టులో ఇటీవల కొట్టివేశారు. ఈ వ్యవహారానికి వ్యాపారస్దుల మద్య విబేదాలే కారణమై ఉంటాయని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. వ్యాపార భాగస్వాములు ఫిర్యాదు చేస్తే తెనాలి పోలీసులు రవితేజను బలవంతంగా తీసుకెళ్ళారా… లేక వచ్చింది వ్యాపార భాగస్వాములు పంపిన కిరాయి రౌడీలా అన్నదే అర్ధం కావడం లేదని రవి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవితేజ ను బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉన్న సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




