కాపు ఉద్యమ నేత ముద్రగడను కలవనున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. బీజేపీలో చేరికపై చర్చ..

కాపు ఉద్యమ నేత ముద్రగడను కలవనున్న బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. బీజేపీలో చేరికపై చర్చ..

Somu Veerraju meet Mudragada: ఏపీలో బీజేపీ నేతలు కీలక నేతలకు గాలం వేస్తున్నారు. దూకుడు పెంచుతూ ప్రముఖులను పార్టీలో

uppula Raju

|

Jan 16, 2021 | 9:38 AM

Somu Veerraju meet Mudragada: ఏపీలో బీజేపీ నేతలు కీలక నేతలకు గాలం వేస్తున్నారు. దూకుడు పెంచుతూ ప్రముఖులను పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ కాపు ఉద్యమనేత ముద్రగడను కలవనున్నట్లు ప్రకటించారు. ముద్రగడను బీజేపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరగుతున్నాయనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. ముద్రగడ ప్రస్తుతం కాపు ఉద్యమానికి కూడా దూరంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఆహ్వానాన్ని ఆయన మన్నిస్తారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. కాపు సామాజికవర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు కలిగిన ముద్రగడ బీజేపీలో చేరితే రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారే అవకాశ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సినీ నటి వాణి విశ్వనాథ్‌ను కూడా సోము వీర్రాజు ఇటీవల కలిశారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఆమె ఇంత వరకు తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. టీడీపీ నేత కళా వెంకట్రావ్‌ను కూడా కలిసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీలో ఎవరెవర చేరుతున్నారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.

గాలిపటం ఎగరేస్తూ భవనం పై నుంచి పడిపోయి ఒకరు మృతి.. విషాదంలో కుటుంబ సభ్యులు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu