బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు.. అఖిలప్రియ ఫోన్ల స్వాధీనానికి ఖాకీల ప్రయత్నం..

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు.. అఖిలప్రియ ఫోన్ల స్వాధీనానికి ఖాకీల ప్రయత్నం..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 8:43 AM

Bowenpally Kidnap Case: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను విచారించిన పోలీసులు పలు విషయాలను రాబట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను కోసం పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం 12మంది నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌ను నిందితులుగా చేర్చిన పోలీసులు వాళ్ల కోసం కూడా వెతుకుతున్నారు.

ఇదిలా ఉంటే అఖిలప్రియ సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అపహరణ సమయంలో కిడ్నాపర్లతో ఆమె తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణితో పాటు అపహరణ సందర్భంగా మాట్లాడేందుకు తాత్కాలికంగా మరో సెల్‌ఫోన్‌ ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి కూకట్‌పల్లిలోని లోధ అపార్ట్‌మెంట్ వరకు ఆమె రెండు చరవాణిల్లో మాట్లాడుకుంటూ వచ్చినట్లు పోలీసులు తేల్చారు. రెండు చరవాణిలు ఆమె ఇంట్లోనే ఉండిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అఖిలప్రియ ఇళ్లకు తాళం వేసి ఉంది. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి ఇంటి తాళం తీసి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

సూర్యాపేటలో అమానుషం.. ఫొటోకు చెప్పులదండవేసి కన్న తండ్రినే కిడ్నాప్ చేసిన కొడుకులు, విలవిల్లాడుతోన్న తల్లి

Note for Vote case investigation: ఓటుకు నోటు కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. కీలక వాంగ్మూలమిచ్చిన మత్తయ్య