Today Gold Price: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నార్త్‌లో మాత్రం…
Today Gold Price: గత కొన్నిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల కాలంలో కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఇదిలా ఉంటే..
Today Gold Price: గత కొన్నిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల కాలంలో కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. మరి శనివారం దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తులం బంగారం ఎంత పలికిందో ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 48,150 పలకగా.. 24 క్యారెట్లు రూ.52,520 గా ఉంది. (శుక్రవారంతో పోలీస్తే ఢిల్లీలో రూ.230 వరకు ధర తగ్గింది). ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,450గా ఉంది (ఇక్కడ కేవలం రూ.20 పెరిగింది).
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 50,180 గా నమోదైంది. (శుక్రవారంతో పోల్చితే సుమారు రూ.280 పెరిగింది). ఇక విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,180 గా ఉంది. విశాఖపట్నంలోనూ బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 46,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్.. రూ.50,180గా పలికింది.