RGV Tweet: కేజీఎఫ్‌-2 చిత్రంపై తనదైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ… బాహుబలి, ఆర్‌.ఆర్‌.ఆర్‌తో పోలుస్తూ…

RGV Tweet About KGF-2: యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్‌' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...

RGV Tweet: కేజీఎఫ్‌-2 చిత్రంపై తనదైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్‌ వర్మ... బాహుబలి, ఆర్‌.ఆర్‌.ఆర్‌తో పోలుస్తూ...
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 16, 2021 | 5:33 AM

RGV Tweet About KGF-2: యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్‌’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదల వరకు పెద్దగా ఎవరికీ తెలియని ఈ చిత్రం విడుదల తర్వాత యావత్‌ భారతీయ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌-2’ తెరకెక్కుతోన్నవిషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట్లో సంచలనంగా మారింది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ టీజర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా సంచనల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు. కేజీఎఫ్‌2 టీజర్‌పై వర్మ స్పందిస్తూ.. ‘బాహుబలి2 ట్రైలర్‌ 11 కోట్ల వ్యూలకు చేరుకోవడానికి మూడేళ్లు పట్టింది. ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీజర్‌కు 3.8 కోట్ల వ్యూలు రావడానకి మూడు నెలలు పట్టింది. కానీ ‘కేజీఎఫ్‌2′ టీజర్‌ మాత్రం కేవలం మూడు రోజుల్లోనే 14 కోట్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. దీంతో అన్ని చిత్ర పరిశ్రమలకు ప్రశాంత్‌ నీల్‌ గట్టి పంచ్‌ ఇచ్చినట్లయింది’ అంటూ ట్వీట్‌ చేశారు వర్మ. ఇదిలా ఉంటే రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం ‘డి కంపెనీ’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించే పనిలో పడ్డారు. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వర్మ ప్రకటించారు.

AlSo Read: Ram Gopal Varma : మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ జీవిత కథతో వెబ్ సిరీస్.. త్వరలోనే ట్రైలర్