Andhra Pradesh: కేటుగాళ్ల ‘లగ్జరీ’ ప్లాన్.. పోలీసుల ఫ్యూజులు ఔట్.. ఇంతకీ వాళ్ల మాస్టర్ ప్లాన్ ఏంటంటే..
Andhra Pradesh: ఏపీలో ఎంత నిఘా పెంచిన గంజాయి అక్రమ రవాణా ఏదో మార్గంలో కొనసాగుతూనే ఉంది.
Andhra Pradesh: ఏపీలో ఎంత నిఘా పెంచిన గంజాయి అక్రమ రవాణా ఏదో మార్గంలో కొనసాగుతూనే ఉంది. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు మాత్రం విశాఖ ఏజెన్సీలోనే ఉంటున్నాయి. పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో.. స్మగ్లర్లు సరికొత్త మార్గాల్లో గంజాయి అక్రమ రవాణాకు యత్నిస్తున్నారు. రూట్ మార్చిన స్మగ్లర్లు ఖరీదైన కార్ల ద్వారా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ పట్టుబడ్డారు. ఓ ఖరీదైన కార్లలో దర్జాగా, ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా తరలిస్తున్న గంజాయి పట్టుకున్నారు పోలీసులు.
ఈ సారి స్మగ్లర్లు వేసిన ప్లాన్ చూసి పోలీసులే కంగుతిన్నారు. కారు డోర్లు, అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లను జాగ్రత్తగా అమర్చి.. ఎవరికీ అనుమానం రాకుండా గట్టి సెట్టప్ ఏర్పాటు చేసుకున్నారు. విశాఖ జిల్లా, గొలుగొండ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన మారుతీ సుజికి, ఓ ఫార్చ్యునర్ కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు..దాంతో గంజాయి గుట్టు బయటపడింది..దీంతో ఇర్ఫాన్ అలీ, రిజ్వాన్ అలీ, అక్తర్ మాలిక్, ఖలీద్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. రెండు కార్లు, 4 సెల్‌ఫోన్లు, రూ.91 వేల నగదును సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read: