Andhra Pradesh: మంచు దుప్పటి కప్పుకున్న మన్యం ప్రాంతాలు.. గజ గజ వణుకుతున్న ఏజన్సీ వాసులు
ఓ వైపు పొగమంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు అటవీ ప్రాంతాలు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. అల్లూరి జిల్లా చింతూరు ఏజన్సీని మంచు దుప్పటి కప్పేస్తోంది. బారెడు పొద్దెక్కినా మంచు ముసుగు తీయడం లేదు. దీంతో ఏజన్సీ వాసులను చలి పులిలా వణికిస్తోంది. గత వారం రోజులుగా తీవ్ర మంచు ప్రభావంతో జనం గజ గజ వణికిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. మన్యం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం 9, 10 అయినా బయటకు రావడానికి ప్రజలు చలికి గజగజా వణుకుతున్నారు. డిసెంబర్ చివర్లోనే చలి తీవ్రత ఈ రేంజ్ లో ఉంటే .. రానున్న జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎలా ఉంటుందో ఊహించలేము. అయితే ఓ వైపు పొగమంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు అటవీ ప్రాంతాలు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. అల్లూరి జిల్లా చింతూరు ఏజన్సీని మంచు దుప్పటి కప్పేస్తోంది. బారెడు పొద్దెక్కినా మంచు ముసుగు తీయడం లేదు. దీంతో ఏజన్సీ వాసులను చలి పులిలా వణికిస్తోంది. గత వారం రోజులుగా తీవ్ర మంచు ప్రభావంతో జనం గజ గజ వణికిపోతున్నారు.
చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం, ఏటపాక, మండలాల్లో మంచు తీవ్రంగా కమ్మే స్తోంది. ప్రధాన రహదారులు మంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కూనవరం శబరి బ్రిడ్జి వద్ద పొగ మంచు సూర్యుడ్ని కూడ కనపడకుండా కమ్మేసింది. ఏజన్సీ లో ఎప్పుడు లేని విధంగా మంచు కురుస్తుండటంతో స్థానిక మన్యం వాసులు చలి మంటలు వేసుకుని కూర్చుంటున్నారు. ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ మీదుగా వచ్చే వాహనదారులు మంచు తగ్గిన తర్వాత మాత్రమే రహదారిపై ప్రయాణాలు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..