పదవ తరగతి పరీక్షల్లో 566 మార్కులు సాధించిన ఆరో తరగతి విద్యార్థిని
ఆరోతరగతి చదువుతూనే ఏకంగా పదో తరగతి పరీక్షలు రాసి షబాశ్ అనిపించింది ఓ విద్యార్థిని. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 600లకు 566 మార్కులు సాధించి సత్తా చాటింది. వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన చిర్రా అనఘాలక్ష్మి (11).. ప్రస్తుతం బ్రాడీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.
ఆరోతరగతి చదువుతూనే ఏకంగా పదో తరగతి పరీక్షలు రాసి షబాశ్ అనిపించింది ఓ విద్యార్థిని. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 600లకు 566 మార్కులు సాధించి సత్తా చాటింది. వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన చిర్రా అనఘాలక్ష్మి (11).. ప్రస్తుతం బ్రాడీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు సత్యదేవి, విష్ణువర్ధనరెడ్డి. తండ్రి మంగళగిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తుండగా.. తల్లి మ్యాథ్స్ ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశారు. అయితే చిన్నప్పటి నుంచి తల్లి చెప్పే పాఠాలను వింటూ వస్తున్న అనఘా.. అబాకస్, వేదగణితంలో కూడా తన ప్రతిభ కనబర్చింది.
అయితే ఆరో తరగతిలో ఉండగానే పదో తరగతి పరీక్షలు రాయడం ఏంటని అనుకుంటున్నారా ?. అయితే చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ బాలిక ప్రతిభను చూసి మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశంసించారు. అలాగే ఆమె పదో తరగతి పరీక్షలు రాయించమని సూచించారు. పాఠశాల డైరెక్టర్ ఆర్.రాము, తల్లిదండ్రులు విద్యా శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుని పదో తరగతి పరీక్షలకు పంపారు. శనివారం విడుదలైన ఫలితాల్లో ఆమె మార్కులను చూసి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం