Balakrishna: టీడీపీ.. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది.. ఇకపై అండగా నేనుంటా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..

తెలుగు వాడి ఆత్మాభిమానం.. ఆత్మ గౌరవం ఎన్టీఆర్.. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తు చేసే పేరు ఎన్టీఆర్.. NTR అంటే నటనకు ఒక గ్రంధాలయం.. యువతకు ఆదర్శం.. ప్రపంచంలో ఇంత గొప్ప వ్యక్తి లేడు.. అంటూ నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో జరుగుతున్న NTR శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న టీడీపీ నేత, హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Balakrishna: టీడీపీ.. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది.. ఇకపై అండగా నేనుంటా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..
Nandamuri Balakrishna
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 08, 2023 | 2:49 PM

తెలుగు వాడి ఆత్మాభిమానం.. ఆత్మ గౌరవం ఎన్టీఆర్.. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తు చేసే పేరు ఎన్టీఆర్.. NTR అంటే నటనకు ఒక గ్రంధాలయం.. యువతకు ఆదర్శం.. ప్రపంచంలో ఇంత గొప్ప వ్యక్తి లేడు.. అంటూ నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో జరుగుతున్న NTR శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న టీడీపీ నేత, హిందూపూర్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులకు మించినది ఏమి లేదు.. కారణ జన్ముడు, నా గురువు.. మా నాన్న ఎన్టీఆర్ అంటూ పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు తాను అతిథిని కాదని.. టీడీపీ కార్యకర్తని.. టీడీపీ మనది.. అంటూ పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రావాలి.. దాని కోసం కృషి చేస్తానంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ టీడీపీ ఉంటుందని.. అండగా నేనుంటా.. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపాలని బాలకృష్ణ ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

NTR ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని.. ఎన్టీఆర్ తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు ఆయన పథకాలే ప్రవేశ పెట్టారంటూ పేర్కొన్నారు. తొలిసారి దేశంలోనే పక్కా ఇల్లు ఇచ్చారు.. పటేల్ పట్వారీ వ్యవస్థను ప్రవేశ పెట్టారన్నారు. జోగిని వ్యవస్థ రద్దు చేసింది.. ట్యాంక్ బండ్ పై మహనీయుల విగ్రహాలు పెట్టింది ఎన్టీఆర్ అంటూ పేర్కొన్నారు. దేశం మొత్తం ఆయన పేరు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారు.. వేరే వేరే పార్టీల్లో ఉన్న వారికి ఆయన పెట్టిన బిక్షే పదవులు అంటూ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా NTRకు భారత రత్న పురస్కారం విషయం మరోమారు తెర మీదకు వచ్చింది. మళ్లీ మళ్లీ చెబుతున్నానంటూ టీడీపీ నేత, ఎమ్మెల్యే బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. NTRకు భారత రత్న ఇచ్చి తీరాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు బాలకృష్ణ. దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చిన మహానుభావుడికి దేశం గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. NTR కు ఇవ్వకపోతే ఎవరికీ ఇస్తారు భారత రత్న.. బాలకృష్ణ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..