Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GVMC: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి వశం కాబోతుందా?

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం పీక్ స్టేజ్ కు చేరుకుంది. వ్యూహ, ప్రతి వ్యూహాలతో కూటమి, వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. ఎలాగైనా మేయర్ పీఠాన్ని కొట్టేయాలని కూటమి చూస్తుంటే.. ఆ వ్యూహానికి చెక్ పెట్టాలని వైసీపీ అస్త్రాలు సిద్ధం చేస్తోంది. దీంతో GVMC రాజకీయం రసకందాయంగా మారింది

GVMC: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి వశం కాబోతుందా?
Visakhapatnam Municipal Corporation
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 22, 2025 | 5:39 PM

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌పై పట్టుకు కూటమి ప్రయత్నిస్తోంది. మేయర్ సీటు టార్గెట్‌గా ప్రయత్నాలు చేస్తోంది. అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్‌కి నోటీసు ఇచ్చారు కూటమి కార్పొరేటర్లు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ నేతృత్వంలో కలెక్టర్‌ను కలిశారు. బలనిరూపణ సమయానికి తిరుగులేని మెజార్టీ ఉండే విధంగా కూటమి పావులు కదుపుతోంది. తాజాగా కూటమి గూటికి చేరారు ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు. మరింత మందిని చేర్చుకునే దిశగా కూటమి యత్నిస్తోంది. ఉన్న కార్పొరేటర్లు చేజారకుండా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.

2021 ఎన్నికల్లో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 98 కార్పొరేటర్ల స్థానాల్లో వైసీపీ 59 స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ అధిష్టానం ఎందరో సీనియర్లను కాదని యాదవ సామాజికవర్గానికి చెందిన మహిళ గొలగాని హరి వెంకట కుమారికి మేయర్ పదవిని కట్టబెట్టింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్ల పాటు మేయర్ పదవికి ఎలాంటి డోకా లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి GVMCలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.

చట్టప్రకారం అవిశ్వాసం పెట్టేందుకు మేయర్ పదవి కాలం నాలుగేళ్లు పూర్తవ్వాలి. అది ఈనెల 18తో పూర్తవడంతో కూటమి మరింత స్పీడ్‌గా రాజకీయం నడుపుతుంది. సాధ్యమైనంత సంఖ్యా బలాన్ని పెంచుకొని.. మేయర్ సీటుకు ఎసరుపెట్టాలని చూస్తోంది. అందుకోసం వైసీపీ కార్పొరేటర్లకు గాలం వేస్తోంది. ఈక్రమంలో అవిశ్వాసం కోసం కలెక్టర్‌కు నోటీసు ఇచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!