Andhra: పొదల్లో కనిపించిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు.. కొన్నాళ్లకు
120 గుడ్లు ఏ జీవి పెడుతుంది.. ఏమో మాకేం తెలుసు అంటారా..? .. అవును.. అన్ని గుడ్లు ఏది పెడుతుందో సాధారణ జనం ఊహించడం కష్టం. అందుకే ఆ గుడ్లను కదిలించకుండా వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు అక్కడి స్థానికులు. వారు వచ్చి ఆ గుడ్లను జాగ్రత్తగా సేకరించి తీసుకెళ్లారు...

పాములను చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం… కొద్దిగా ధైర్యం ఉంటే వాటిని కొట్టి చంపేస్తాం… అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావని, జీవ వైవిధ్యంలో పాముల పాత్ర గణనీయంగా ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతుంటారు… ఇలాంటి సందర్భంలో ఓ చోట 120 పాము గుడ్లు స్థానికుల కంట పడటంతో హడలిపోయారు… వెంటనే అటవీశాఖ అధికారులకు సామాచారం ఇచ్చారు… పాముగుడ్లను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు వాటిని పొదిగించి పిల్లలను చేశారు… ఇవి హానికారక పాములు కాదని, నీటికుంటల్లో నివాసముండే విషరహిత పాములైన నీరుకుట్టు పాములుగా నిర్ధారించి వాటిని సమీపంలోని పలు నీటి కుంటల్లో వదిలేశారు.

Baby Snakes
ప్రకాశం జిల్లా మార్కాపురంలో అటవీశాఖ అధికారులు 80 పాము పిల్లలకు పురుడు పోశారు. కొద్ది రోజుల క్రితం పట్టణంలోని ఓ ప్రాంతంలో 120 పాము గుడ్లను స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఆ గుడ్లను తీసుకువెళ్లి అటవీశాఖ కార్యాలయంలోని ఓ గదిలో భద్రపరిచారు. జీవం పోసుకునే విధంగా గుడ్లను ఇసుక డబ్బాలలో భద్రపరిచారు. కొద్దిరోజుల తర్వాత దాదాపు 80 పాము పిల్లలు పురుడు పోసుకోవడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. నీటి కుంట జాతికి చెందిన పాములు కావడంతో అటవీశాఖ అధికారులు కొన్ని పాములు కంభం చెరువులో మరికొన్ని పాములను దోర్నాల చెరువులో విడిచిపెట్టారు. ప్రకృతిని పరిరక్షించడంలో ముఖ్యపాత్ర పోషించే పాములను అధికారులు సంరక్షించడంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.