Pawan Kalyan: సభలో ఓజీ ఓజీ అంటూ అభిమానుల అరుపులు.. పవన్ రెస్పాన్స్ ఇదే
మీకో దండం నాయనా.. మీకు నమస్కారం పెట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నా అంటూ అభిమానులకు నవ్వుతూనే చురకలంటిచారు డిప్యూటీ సీఎం పవన్. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచర్ల గ్రామంలో ఈ సీన్ జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

కర్నూలు జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్‌కు కాస్త ఇబ్బంది కలిగించారు ఆయన అభిమానులు. సమయం, సందర్భంతో పనిలేకుండా ఓజీ ఓజీ అని నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ కనిపిస్తే చాలు.. ఆయన అభిమానులకు పూనకాలొస్తాయి.. గతంలో పవన్.. పవన్ అని అరిచేవారు. ఓజీ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి కల్యాణ్ ఎక్కడ కనిపించినా ఓజీ ఓజీ అంటూ హోరెత్తిస్తున్నారు అభిమానులు. కర్నూలు జిల్లాలోని పూడిచర్లలో పంట కుంట నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. అనంతరం సభలో ప్రసంగిస్తుండగా ఫ్యాన్స్ చేసిన ఓజీ సౌండ్.. రీసౌండ్ ఇచ్చింది.
తాను డిప్యూటీ సీఎంను అని.. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు పవన్ కల్యాణ్. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కాదు… డెవలప్‌మెంట్ గేర్‌లో ఏపీ ఎలా దూసుకుపోతుందో చూడాలన్నారు ఉప ముఖ్యమంత్రి. తనకు ఇంతటి విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు చెబుతూనే.. రాష్ట్ర భవిష్యత్ ప్రధానం అన్న సూచన చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలపై తాను ఫోకస్ చేస్తుంటే.. ఫ్యాన్స్ ఇంకా ఓజీ మూడ్‌లోనే ఉండిపోవడం తనకు నచ్చలేదన్నారు పవన్. అయితే పవన్ తన అభిమానుల మనసు నొచ్చుకోకుండా సున్నితంగా నవ్వుతూ తన మనసులోని మాట చెప్పారు పవన్. మీతో పెట్టుకోలేం.. మీకో నమస్కారం అనేశారు పవన్ కల్యాణ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.