AP Corona Updates: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా..
AP Corona Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా ఇవాళ కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62,657 శాంపిల్స్ పరీక్షించిన వైద్యులు.. 1,578 మందికి కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజాగా బాధితుల సంఖ్యతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,24,421 కి చేరింది. కరోనా నుంచి ఒక్క రోజులో 3,041 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 18,84,202 మంది కోలుకున్నారు.
ఇక కరోనా కారణంగా చిత్తూరు జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా వైరస్ ప్రభావంతో 13,024 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,48,945 శాంపిల్స్ సేకరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 37, చిత్తూరు జిల్లాలో 257, తూర్పు గోదావరి – 305, గుంటూరు – 97, కడప – 117, కృష్ణా 92, కర్నూలు – 35, నెల్లూరు – 179, ప్రకాశం – 173, శ్రీకాకుళం – 31, విశాఖపట్నం – 68, విజయనగరం – 35, పశ్చిమ గోదావరి – 152 చొప్పున జిల్లాల్లో మొత్తం 1,578 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ArogyaAndhra Tweet:
#COVIDUpdates: 12/07/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,21,526 పాజిటివ్ కేసు లకు గాను *18,81,307 మంది డిశ్చార్జ్ కాగా *13,024 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 27,195#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/XEKSWLXvo4
— ArogyaAndhra (@ArogyaAndhra) July 12, 2021
Also read:
ఆ టూరిస్టు ప్రాంతాల్లో జల విలయం.. ఉధృత నీటి ప్రవాహంలో పడవల్లా కొట్టుకొస్తున్న కార్లు.. ఎక్కడంటే..?
మీ పాలనా వ్యవస్థ దారుణం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మాజీ అధికారుల బహిరంగ లేఖ..