వావివరసలు మరిస్తే అంతే.. దారితప్పిన కొడుకును కన్నతల్లి ఏం చేసిందంటే.. వామ్మో వణకాల్సిందే..
హైదరాబాద్‌లోని మీర్ పేట్‌లో భార్యను ముక్కలుగా నరికి హత్య చేసిన దారుణ ఘటన మరువక ముందే ప్రకాశం జిల్లాలో అలాంటి దారుణమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని తెలుగు వీధిలో 35 ఏళ్ళ కన్న కొడుకు శ్యామ్ ను కన్నతల్లి సాలమ్మ ఓ ఆటో డ్రైవర్ మోహన్ తో కలిసి హత్య చేయించింది.

హైదరాబాద్‌లోని మీర్ పేట్‌లో భార్యను ముక్కలుగా నరికి హత్య చేసిన దారుణ ఘటన మరువక ముందే ప్రకాశం జిల్లాలో అలాంటి దారుణమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని తెలుగు వీధిలో 35 ఏళ్ళ కన్న కొడుకు శ్యామ్ ను కన్నతల్లి సాలమ్మ ఓ ఆటో డ్రైవర్ మోహన్ తో కలిసి హత్య చేయించింది. తరువాత శరీర భాగాలను ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కుక్కి కాలువలో పడేశారు. మేదర బజారు సమీపంలోని పంట కాలువలో గోన సంచుల్లో కుక్కి పడవేసిన శ్యామ్ శరీర భాగాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన కొడుకు వావివరసలు మరిచి మహిళలపై దాడులు చేస్తుండటంతో తట్టుకోలేక ఆ తల్లి కొడుకును హత్య చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని తెలుగు వీధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. చెడు అలవాట్లకు బానిసై గాడి తప్పిన కొడుకు శ్యామ్ (35)ను కన్నతల్లి సాలమ్మ హత్య చేయించింది. మోహన్ అనే వ్యక్తి తో కలిసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి 3 గోన సంచుల్లో కుక్కీ మేదర వీధి సమీపంలోని పంట కాలువ వద్ద పడవేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు తమ కొడుకు శ్యామ్ కనిపించడం లేదని కాలనీ వాసులకు చెప్పారు. అయితే మేదరవీధిలో మూడు గోనె సంచుల్లో వ్యక్తి మృతదేహం శరీర భాగాలు ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరిశీలించిన పోలీసులు మృతదేహం శ్యామ్‌దిగా గుర్తించారు.
శ్యామ్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించడంతో.. తల్లే ఈ హత్య చేయించినట్టు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఘటనా స్థలాన్ని మార్కాపురం డిఎస్‌పి నాగరాజు పరిశీలించారు. మృతుని శరీర భాగాలు పడవేసిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. తల్లి సాలమ్మ, ఆటో డ్రైవర్ మోహన్ తో పాటు శ్యామ్ పెద్దన్న సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితులు చెబుతున్న కారణాలు పొంతన లేకపోవడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
ఆస్తి తగాదాల నేపథ్యంలో హత్య జరిగినట్లుగా తొలుత అనుమానించినా.. ఆ తర్వాత సంచలన విషయం వెలుగుచూసింది.. మద్యానికి బానిసగా మారిన శ్యామ్ తన ఇంట్లోని మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య కంభం పట్టణంలో కలకలం రేపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..