Valentines Day: మత జాడ్యాన్ని ఓడించి ప్రేమలో గెలిచారు.. ముస్లిం అబ్బాయి ఆంగ్లో ఇండియన్ అమ్మాయి లవ్ స్టోరీ
ప్రేమ.. సరికొత్త ఊహాలోకాలకు ప్రాణం పోస్తుంది. ఊహకు కూడా అందని విషయాలను నిజం చేసి ఆహా అనిపించి ఆశ్చర్యపరుస్తుంది... దీనికి నిలువెత్తు ఉదాహరణ విశాఖలోని ఓ జంట ప్రేమకథ..! మతం జాడ్యాన్ని ఓడించి ప్రేమలో గెలిచారు.. ఎదురొడ్డి నిలిచి ఏకం అయ్యేందుకు యుద్ధమే చేశారు..! చివరకు నిలిచి సాధించారు.. అందరి మనసులు గెలిచారు.. ఇక.. వాళ్ల జంట నుంచి చుస్తే.. ఔరా అది కదా అసలు సిసలైన లవ్ కపుల్స్ అంటే మరి అనాల్సిందే. స్వచ్ఛమైన ప్రేమ ముందు రిలీజియన్, క్యాస్ట్, కలర్.. బలాదూర్ అనుకున్న ఆంగ్లో ఇండియన్ అమ్మాయి.. ముస్లిం అబ్బాయి లవ్ స్టోరీ మీకోసం..

అది కాలేజ్ డేస్.. ఇంటర్మీడియట్.. టీనేజ్ వయసు.. విద్యా సంవత్సరం మొదలైంది. సీనియర్లు జూనియర్ల మధ్య కాస్త పరిచయాలు పెరిగాయి. అది కాస్తా మూడుసార్లు ప్రపోజ్లు.. రిజెక్ట్ లు..! ఇక్కడ ప్రపోజ్ చేసింది అమ్మాయి రిజెక్ట్ చేసింది అబ్బాయి. ఆ తర్వాత ఓకే అయినా పెళ్లి విషయం వచ్చేసరికి పంతాలు. మీ మతం.. మా మతం అని పెద్దలు పెద్దలు కన్నెర్ర చేశారు. అయినా ఆ ఇద్దరు వెనుదిరిగి చూడలేదు చూడలేదు. అమ్మాయి కంటే ఆర్థికంగా అబ్బాయి వెనుకబడి ఉండడం కూడా వారి ప్రేమపై ప్రశ్నలు లేవనెత్తాయి. అయినప్పటికీ మన స్వచ్ఛమైన ప్రేమ ముందు ఇవన్నీ అవసరం లేదని అనుకుంది యువతి.
అబ్బాయి పేరు మొహిద్దిన్.. అమ్మాయి రెబెకా..! అబ్బాయి ముస్లిం, అమ్మాయి ఆంగ్లో ఇండియన్.. క్రిస్టియన్ కమ్యూనిటీ. ఇద్దరి కుటుంబ నేపద్యాలు వేరు.. ఆర్థిక సామాజిక పరిస్థితులు కూడా వేరువేరు.. కాలేజీలో కలిసి మనసులు ఏకం చేసుకుని.. ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలు ఏది వద్దనే అనుకున్నారు. ప్రేమ అనే ఆయుధంతో.. మతం అనే జాడ్యాన్ని పటాపంచలు చేశారు. చివరకు గెలిచి నిలిచారు.
మొహిద్దిన్ కు ముందే తెలుసు..
ఇక ప్రేమించుకున్న ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని శపధం చేసుకున్నారు. ప్రళయం లాంటి పరిస్థితులు ఎదురైనా ఒకరిగా ఉందామని అనుకున్నారు. పెళ్లి విషయం పెద్దల దృష్టికి తీసుకువచ్చారు. మొహిద్దిన్కు ముందే తెలుసు తమ ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోరని. ఎందుకంటే క్యాస్ట్, కాస్ట్.. కలర్ కూడా అనుకున్నాడు మొహిద్దిన్. అలాగే జరిగింది. రెబెక్కా తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఒప్పుకున్నదే లేదు.. వాడితోనా నువ్వు ఉండేది.. వాళ్ళ ఇంట్లో నువ్వు ఉండగలవా.. వాళ్ల ఆచార వ్యవహారాలు వేరు.. మన సంప్రదాయాలు వేరు.. అయినా మన ఫ్యామిలీకి వాడు సూట్ కాడులే అన్నారట.
ఆ సిన్సియారిటీ ఆమెకు తెగ నచ్చేసిందట..
అయినా మొహిద్దిన్ సిన్సియారిటీ ముందు పేరెంట్స్ మాటలు కూడా రెబెక్కా కు వెనుదిరిగి చూడనివ్వలేదు. కానీ పెంచి చిన్నప్పటినుంచి ఆలానా పాలన చేసుకున్న పేరెంట్స్ ప్రేమ ఒకవైపు… తనకు జీవితంలో భాగస్వామిగా ఉంటే తనే ఉండాలి అని అనుకొని మనసు పడిన మోహిదునుపై ప్రేమ మరోవైపు.. వీటిలో మొహిద్దిన్ వైపే మొగ్గు చూపింది. పేరెంట్స్కు నచ్చజెప్పిన ఫలితం లేకపోవడంతో.. ఇక మొహిదీంతోనే తన జీవితం అంటూ చేయి పట్టుకుంది. అంతకుమించి మొహిద్దిన్ కుటుంబంలో నలుగురు అక్కచెల్లెళ్లకు ఏకైక సోదరుడు. అమ్మాయి తరపు కూడా నలుగురు అక్క చెల్లెలు. తోబుట్టువులకు అత్యంత ప్రేమతో చూసుకునే మోహిద్దీన్.. తన కుటుంబాన్ని పరిచయం చేసేసరికి రెబెక్కాకు ఆ ఫ్యామిలీ జగన్ నచ్చేసింది. ఆర్థికంగా వెనకబడితేనేమి.. నిండు మనసుతో ఆశీర్వదించి ఆ కుటుంబం లో వెళ్తే చాలు.. తోబుటులకు ప్రేమతో చూసుకునే మొహిద్దిన్.. తనకు కూడా అదే స్థాయిలో ప్రేమతో చూసుకుంటాడని బలంగా నమ్మింది. అందుకే తాను ఇక చేయి విడలేదు అంటుంది రెబెక్కా అలియాస్ ముస్కాన్.
ప్రేమ నుంచి పెళ్లి వరకు ఒడుదుడుకులు..
ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా.. వాళ్లను కాదని ఎదిరించి మోహిద్దీన్ ను వివాహం చేసుకుంది రెబెక్కా. వివాహం 2020 నవంబర్లో 17 న జరిగింది. కొంతమంది స్నేహితుల సహకారంతో మోహిద్దీన్ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరూ ఏకమయ్యారు. రెబెక్కా చెరగని చిరునవ్వును గుర్తించి ముస్కాన్ గా పిలుచుకున్నారు అబ్బాయి కుటుంబం. ప్రేమ, పెళ్లి జరిగిన క్రమంలో మొహిద్దిన్కు అమ్మాయి పేరెంట్స్ తరఫున బెదిరింపులు.. పోలీస్ కేసులు పెట్టేంత పరిస్థితులు కూడా వచ్చాయి.. దీంతో తమ ప్రేమ కోసం పెద్ద యుద్దమే చేయాల్సి వచ్చింది. అబ్బాయిలో సిన్సియరిటి.. అమ్మాయిలో పట్టుదల కలగలిసి తమ ప్రేమ జయించిందని అంటున్నారు ఈ కపుల్.
ఇప్పుడు ఫుల్ హ్యాపీ..
వీరిద్దరికీ ఇప్పుడు ఏడాదిన్నర వయసున్న పండంటి బిడ్డ. బిడ్డ పుట్టిన తర్వాత అమ్మమ్మ తాత ఎలా మనసు కరిగింది. ఎంతైనా.. కన్న కూతురే కదా కోరుకునే వాడి దగ్గర ఉంటానంటే అంతకంటే ఏంటి అనుకున్నారు. ఆలస్యంగానైనా మనసు మార్చుకుని కూతురు అల్లుడు, మనవడును అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు మొహిద్దిన్, రెబెక్కా జీవితం ఫుల్ హ్యాపీ. ఈ టోటల్ లవ్ ఎపిసోడ్ లో రెబెక్కా పాత్రే కీలకమంటున్నాడు మొహిద్దీన్. రిలీజియన్, క్యాష్, వర్ణ భేదాన్ని పక్కనపెట్టి.. ప్రేమించి.. గెలిచి నిలిచి ఇప్పుడు పెద్దల మనసులను సైతం గెలుచుకున్న ఈ కపుల్స్ జీవితమంతా హ్యాపీగా సాగిపోవాలని మనసారా కోరుకుందాం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..