AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Secretariat Exams: సచివాలయ ఉద్యోగులకు అలెర్ట్.. రాత పరీక్షకు డేట్ ఫిక్స్..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామీణ వ్యవస్థలో సంచలన మార్పులు తీసుకొచ్చారు..

AP Secretariat Exams: సచివాలయ ఉద్యోగులకు అలెర్ట్.. రాత పరీక్షకు డేట్ ఫిక్స్..!
Students
Ravi Kiran
|

Updated on: Jul 24, 2021 | 9:06 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామీణ వ్యవస్థలో సంచలన మార్పులు తీసుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలను స్థాపించి ప్రభుత్వం అందించే పధకాలను నేరుగా ప్రజల వద్దకే చేరుకునేలా వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. వాటిని నాలుగు నెలల్లోనే భర్తీ కూడా చేసిన విషయం తెలిసిందే. వీరిలో సుమారు 1.21 లక్షల మంది సచివాలయాల్లో పనిచేస్తున్నారు.

ఇదిలా ఉంటే అక్టోబర్ 2వ తేదీకి సచివాలయ తొలి బ్యాచ్ ఉద్యోగులకు రెండేళ్ల సర్వీసు పూర్తవుతుంది. దీనితో వారందరికీ నిబంధనల ప్రకారం పే స్కేలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు అనుగుణంగా క్రెడిట్ బేస్ అసెస్‌మెంట్ పరీక్షను సెప్టెంబర్ 11-17 మధ్య ఒక రోజున నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రాధమిక నిర్ణయానికి వచ్చింది. 100 ప్రశ్నలకు 90 నిమిషాల పాటు పరీక్షను నిర్వహించాలని యోచిస్తోంది. ఈ పరీక్షకు శాఖలవారీగా సిలబస్‌ను సిద్దం చేయనుండగా.. ప్రశ్నాపత్రం తయారీ, ఫలితాల వెల్లడి, ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించిన బాధ్యతలను ఏపీపీఎస్సీకి అప్పగించినట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ వెల్లడించారు.

ఫెయిల్ అయినా సర్వీసు నుంచి తొలగించరు.!

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నిర్వచించే రాత పరీక్షల్లో ఫెయిల్ అయినా సర్వీసుల నుంచి తొలగించరని ఏపీఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయాన్ని సచివాలయశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పినట్లుగా ఆయన వివరించారు. ఉద్యోగుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకే పరీక్షలు నిర్వహిస్తున్నారని శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

Also Read:

రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!

జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!

ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!