Konaseema Floods: వరద ముంపులో లంక గ్రామాలు.. అనారోగ్యం పాలవుతున్న ప్రజలు.. జనజీవనం అస్తవ్యస్తం
లంక గ్రామాలు వరద ముంపు లో చిక్కుకున్నాయి. అప్పన రాముని లంక, సఖినేటిపల్లి లంక, పెదలంక, రామరాజులంక, అప్పనపల్లి, పెదపట్నం, పాశర్లపూడి, శ్రీ రామ్ పేట, పెదపట్నం లంక గ్రామాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుంది.
Konaseema Floods: ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద భారీ వరద నీరు కొనసాగుతూ ఉండటంతో.. గోదావరి నది పరివాహక ప్రాంతాలు వరద గుప్పిట్లో చికుక్కుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిలాల్లోని అనేక గ్రామాల్లో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాజోలు దీవిలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టేకిశెట్టిపాలెం, అప్పన రామునీలంక, పాశర్లపూడి, అప్పనపల్లి కాజ్వేలు మునిగిపోయాయి. దీంతో లంక గ్రామాలు వరద ముంపు లో చిక్కుకున్నాయి. అప్పన రాముని లంక, సఖినేటిపల్లి లంక, పెదలంక, రామరాజులంక, అప్పనపల్లి, పెదపట్నం, పాశర్లపూడి, శ్రీ రామ్ పేట, పెదపట్నం లంక గ్రామాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుంది. గత 11 రోజులుగా వరద ముంపులోనే లంక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
పాశర్లపూడి శ్రీరామ్ పేటలో నెలరోజుల నుండి వరదనీరు చుట్టుముట్టడంతో మత్స్యకార కుటుంబాలు అనారోగ్యం పాలవుతున్నాయి. గ్రామంలోని మహిళ చావు బతుకుల మధ్య ఉండడంతో చేతులతో మోసుకొచ్చి పడవపై తరలించి 108 లో ఆస్పటల్ తరలించారు. మరోవైపు పెర్రావారి మెరకలో సత్యవతి అనే మహిళ మరణించింది. గ్రామం వరద ముంపు కావడంతో పడవపైనే సత్యవతి మృతదేహాన్ని బంధువులు తరలించారు.
చాకలిపాలెం-కనకాయలంక కాజ్వే వరద నీటితో మునిగిపోవడంతో ఇరు జిల్లాల లంక గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణం కొనసాగిస్తున్నారు. గత 38 రోజులుగా కనకాయ లంక ప్రజలు వరద ముంపులోనే అవస్తలు పడుతున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వద్ద వశిష్ట గోదావరికి వరద ఉదృతి పెరిగింది. గత ఏడు రోజులుగా నరసాపురం – సఖినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యలమంచిలి మండలం , కనకయలంక, బాడవ, యలమంచిలి లంక, దోడ్డిపట్ల గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..