AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఐదు రోజులుగా కనిపించని అమ్మాయి.. చంపేస్తాం అంటూ వీడియో.. కాకినాడలో కలకలం..

యువతి అదృశ్యం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో కలకలం రేపుతోంది. నీలపల్లి గ్రామానికి చెందిన యువతి ఐదు రోజుల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు..

Andhra Pradesh: ఐదు రోజులుగా కనిపించని అమ్మాయి.. చంపేస్తాం అంటూ వీడియో.. కాకినాడలో కలకలం..
Women(representative image)
Amarnadh Daneti
|

Updated on: Aug 18, 2022 | 2:05 PM

Share

Crime News: యువతి అదృశ్యం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో కలకలం రేపుతోంది. నీలపల్లి గ్రామానికి చెందిన యువతి ఐదు రోజుల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఐదు రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయిన యువతి ఓ సూసైడ్ నోట్ రాసింది. ఈసూసైడ్ నోట్ యువతి తల్లిదండ్రులను తీవ్రంగా కలచివేస్తోంది. ఇద్దరి యువకుల వల్ల తాను తీవ్ర మనోవేదన చెందుతున్నానని.. వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో రాసింది యువతి. యానం లేదా కోరంగి గోదావరిలో దూకి తాను చనిపోతానని, తన కోసం వెతకవద్దని తెలిపింది. దీంతో యువతి తల్లిదండ్రులు యానం, కోరంగి గోదావరి ప్రాంతాల్లో తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

ఈనెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందగా ఆలస్యంగా ఈఘటన వెలుగులోకి వచ్చింది. తనను మనోవేదనకు గురిచేసిన ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని, అదే తన చివరి కోరికంటూ యువతి సూసైడ్ నోట్ లో రాసింది. మరోవైపు తన కుమార్తెను ఆ ఇద్దరు యువకులే కిడ్నాప్ చేసి ఉంటారని యువతి తండ్రి ఎంఎస్ శర్మఅనుమానిస్తున్నారు. తమకు ఇద్దరు పిల్లలు కాగా.. 3 ఏళ్ల వయసులోనే కుమారుడు మృతిచెందాడని.. తమకు అండగా ఉంటుందనుకున్న కుమార్తే కనిపించకపోవడంతో తండ్రి తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్నాడు. మరోవైపు ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి ఫోటోలను ఓ యువకుడు తగులబెడుతూ.. ఆమె చనిపోకపోతే తానే చంపేస్తానంటున్న వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఈవీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆవీడియో పోస్టు చేసిన వ్యక్తులను విచారించే పనిలో పడ్డారు. సూసైట్ లో యువతి పేర్కొన్న యువకుల పేర్ల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని నేర వార్తల కోసం చూడండి..