AP Weather Alert: బుధవారం ఈశాన్య , పరిసర ప్రాంతాలైన తూర్పు మధ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ , బాంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో అల్పపీడనము ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7 .6 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది. ఇది తదుపరి 06గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా.. రేపు ఉదయానికి ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ , బంగ్లాదేశ్ తీరాల్లో వాయుగుండముగా బలపడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిస్సా ,జార్ఖండ్ , ఉత్తర చత్తీశ్ఘడ్ గుండా ప్రయాణిస్తుందని పేర్కొంది. మరోవైపు మంగళవారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు ఉన్న ఉత్తర -దక్షిణ ద్రోణి ఈరోజు రాయలసీమ నుండి కొమొరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తువరకు వరకు విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు, హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) August 18, 2022
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ , యానాం: ఈ రోజు , రేపు , ఎల్లుండి (ఆగష్టు20వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్: ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. నేడు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు, ఎల్లుండి (ఆగష్టు20వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.