APSET certificate: ఏపీసెట్ సర్టిఫికెట్స్ పరిశీలన వాయిదా.. తిరిగి ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని వెల్లడి
APSET certificate: ఏపీ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ (APSET) 2020 సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేసినట్టు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు...
APSET certificate: ఏపీ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ (APSET) 2020 సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేసినట్టు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు నిర్వహించాల్సిన రెండో దశ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా వేస్తున్నామని తెలిపారు. అయితే తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు.
మొదటి దశ సర్టిఫికేట్ల పరిశీలన హాజరు కాలేకపోయిన అభ్యర్థులు తమ సర్టిఫికేట్ల స్కానింగ్ కాపీలను అటెస్టేషన్ చేసి మెంబర్ సెక్రటరీ apsetau@gmail.com కు మే 10వ తేదీలోగా పంపాలని సూచించారు. పూర్తి వివరాలకు https://apset.net.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
అయితే యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు పొందాలంటే ఏపీసెట్‌లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు కామర్స్, హిస్టరీ, ఎకనమిక్స్ లాంటి 30 సబ్జెక్ట్స్‌లో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు దరఖాస్తు చేయొచ్చు. సంబంధిత సబ్జెక్ట్‌లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్, దివ్యాంగులు 50 శాతం మార్కులతో పాసైతే చాలు దరఖాస్తు చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా రెండో దశ సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేశారు.