NTPC Recruitment 2021: ఎన్‌టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తులకు చివరి తేదీ మే 16
NTPC Recruitment 2021: ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పలు సంస్థలు ఆయా కేటగిరిల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌లు జారీ చేస్తున్నాయి....
NTPC Recruitment 2021: ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పలు సంస్థలు ఆయా కేటగిరిల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌లు జారీ చేస్తున్నాయి. తాజాగా ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో మొత్తం 50 ఖాళీలున్నాయి. ఈ పోస్టులు కేవలం యువతులకు మాత్రమే కేటాయించింది ఎన్‌టీపీసీ లిమిటెడ్. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్- GATE 2021 స్కోర్ ద్వారా ఈ పోస్టుల భర్తీ జరగనుంది.
అయితే ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా. దరఖాస్తుల చేసుకోవడానికి చివరి తేదీ 2021 మే 6వ తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ntpccareers.net/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 50 ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 22 మెకానికల్ ఇంజనీరింగ్- 14 ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 14
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. అయితే గేట్ 2021 స్కోర్ తప్పనిసరి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 16 దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 6 వయస్సు- 27 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం- గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్- GATE 2021 స్కోర్ ఆధారంగా దరఖాస్తులను షార్ట్ లిస్టు తయారు చేస్తారు.