AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Job Notification: ఐఐటీ రూర్కీలో నాన్ టీచింగ్ విభాగంలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్..

ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ నాన్ టీచింగ్ విభాగంలో పలు ఖాళీలను భర్తీ చేయడానికినోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ లో ఇందుకు సంబంధించిన సమాచారం ఉంచింది.

KVD Varma
|

Updated on: Apr 19, 2021 | 7:11 PM

Share

Job Notification: ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ నాన్ టీచింగ్ విభాగంలో పలు ఖాళీలను భర్తీ చేయడానికినోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ లో ఇందుకు సంబంధించిన సమాచారం ఉంచింది. అదేవిధంగా దరఖాస్తు కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. ఆసక్తి కల అభ్యర్ధులు మే 11 వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్లైన్ లో పంపించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:

జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: 1 అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ : 1 post కోచ్ : 6 posts జూనియర్ సూపరింటెండెంట్ : 31 posts జూనియర్ సూపరింటెండెంట్ (రాజభాష): 1 post ఫార్మసిస్ట్: 1 post జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, లబోరేటరీ సర్వీసెస్: 52 posts జూనియర్ అసిస్టెంట్: 39 posts డ్రైవర్: 1 post ఫైనాన్స్ ఆఫీసర్: 1 post జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 2 posts హిందీ ఆఫీసర్: 1 post అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్: 1 post సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 1 post ఎంపికైన అభ్యర్ధులు ఇనిస్టిట్యూట్ కి చెందిన ఏ కాంపస్ లో అయినా నియమించవచ్చు అని ఐఐటీ రూర్కీ తెలిపింది.

గ్రూప్ బీ, సీ పోస్టులకు ఎంపిక రెండు అంచెల్లో ఉంటుంది. మొదటి అంచెలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లీషులో కనీస పరిజ్ఞానం, జనరల్ ఎవర్ నెస్, లాజికల్ రీజనింగ్, బేసిక్ అర్ధమేటిక్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించిన్ ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి రెండో అంచె పరీక్ష ఉంటుంది. ఇది కంప్యూటర్ పై టైపింగ్ టెస్ట్. అదేవిధంగా సంబంధిత సబ్జేకు కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. దీనిలో మెరిట్ సాధించిన వారిని ఎంపిక చేస్తారు.

దరఖాస్తు, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Also Read: Mamata : దేశంలో కరోనా విజృంభణకు మోదీనే కారణం, వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలి : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Migrants: మళ్ళీ మొదలైన వలస జీవుల కరోనా కష్టాలు..ఉపాధి కోల్పోయి ఇళ్లకు చేరుతున్న వేలాది మంది..