TSPSC Notification: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన.. ఫిబ్రవరి 16వ తేదీన ఆ పోస్టులకు ఇంటర్వ్యూలు..
TSPSC Notification: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ..
TSPSC Notification: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 16వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. కాగా, కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీకై గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో మెరిట్ ఆధారంగా 10 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ పదిమంది అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈనెల 16వ తేదీన నాపంల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూకు సంబంధించిన మరింత సమాచారం కోసం టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Also read:
గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్‌పై ఎర్రబెల్లి సమీక్ష.. పలు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి
Anasuya : పోస్టల్ స్టాంప్‌పై అనసూయ ఫొటో.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. కారణాలు ఇలా ఉన్నాయి..