గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌పై ఎర్రబెల్లి సమీక్ష.. పలు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..

గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌పై ఎర్రబెల్లి సమీక్ష.. పలు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి
K Sammaiah

|

Feb 11, 2021 | 6:08 PM

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. హన్మకొండ లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మేయర్ గుండా ప్రకాశ్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా పాల్గొన్నారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రోడ్లు, డ్రైనేజీలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు. రూ.100 కోట్లతో ఫ్లడ్‌ రిలీఫ్‌ వర్క్స్‌ని చేపట్టేందుకు టెండర్లు పూర్తి చేసి, పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి సూచించారు. రూ.36కోట్లతో మడికొండలో చేపట్టిన బయో మైనింగ్ డంపింగ్ యార్డు పనులను ప్రారంభించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 51మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్స్‌ను నియమించే ప్రక్రియ ను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నుండి ఇద్దరు DEE లను డిప్యుటేషన్‌ మీద పంపించారని మంత్రి చెప్పారు. పీఆర్ శాఖ నుంచి 3ఏఈ లకు తోడుగా మరో ముగ్గురు ఏఈ లను డిప్యుటేషన్‌ మీద నియమించుకోవాలని మంత్రి చెప్పారు. మడికొండలోని ఐటీ ఏరియా లో త్రీ స్టార్ హోటల్ నిర్మాణం కోసం 10ఎకరాల స్థలం సేకరించాలని సూచించారు. ఈ స్థలం లో హైదారాబాద్ లోని హైటెక్స్ లాగా మంచి హోటల్ నిర్మాణం జరగనుంది. మామునూరు విమానాశ్రయానికి రైతులు – ప్రభుత్వానికి మధ్య స్థల మార్పిడి తో అవసరమైన పూర్తి స్థల సేకరణ పై కేంద్రానికి రాసిన లేఖ కు రెండు మూడు రోజుల్లో అనుమతులు వస్తాయని, అవి రాగానే, విమానాశ్రయ స్థలాన్ని అప్పగిస్తామని మంత్రికి అధికారులు వివరించారు.

మరోవైపు నగరంలో ఓపెన్ జిమ్ లు, 38 జoక్షన్ల, గ్రీన్ జంక్షన్ల ఏర్పాటు, లక్ష్మీపురం లో సమగ్ర వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు, నైట్ షెల్టర్లు, సెంట్రల్ లైటింగ్ డివెడర్స్ కలరింగ్, ఆర్ట్స్ కాలేజ్, పబ్లిక్ గార్డెన్స్ వంటి చోట్ల వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు వంటి పలు అంశాల్లో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే ఇన్నర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు భూసేకరణ పూర్తి చేసి, వాటి పనులు నిర్ణీత కాలంలో, నాణ్యత ప్రమాణాలతో రాజీ లేకుండా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను అదేశించారు.

పోతన ఆడిటోరియం పునరుద్ధరణ, కాళోజీ కళాక్షేత్రం, ఏకశిలా పార్క్, భద్రకాళి బండ్, ఓరుగల్లు చరిత్ర, పూర్వ వైభవాన్ని చాటి చెప్పే, నగరానికి నాలుగు వైపుల స్వాగత తోరణాల ఏర్పాటు వంటి అనేక అంశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. అసంపూర్తిగా ఉన్న అన్ని పనులను తక్షణమే చేపట్టి వేగంగా పూర్తి చేయాలని మంత్రి అదేశించారు.

Read more:

ఆయన హాయంలోనే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ.. అప్పుడు ఏమీ పట్టనట్టుగా ఉండి.. ఇప్పుడు రంకెలేస్తున్నాడెందుకో..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu