AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migrants: మళ్ళీ మొదలైన వలస జీవుల కరోనా కష్టాలు..ఉపాధి కోల్పోయి ఇళ్లకు చేరుతున్న వేలాది మంది..

కరోనా మహమ్మారి రెండోసారి తన ప్రతాపాన్ని చూపెడుతోంది. మొదటిసారి కరోనా విరుచుకుపడినపుడు ఎటువంటి కష్టాలు వచ్చాయో అటువంటి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. ముఖ్యంగా రెక్కాడితే కానీ, డొక్కాడని కష్ట జీవులకు మళ్ళీ తిప్పలు మొదలయ్యాయి.

Migrants: మళ్ళీ మొదలైన వలస జీవుల కరోనా కష్టాలు..ఉపాధి కోల్పోయి ఇళ్లకు చేరుతున్న వేలాది మంది..
Mumbai
KVD Varma
|

Updated on: Apr 19, 2021 | 7:00 PM

Share

Migrants: కరోనా మహమ్మారి రెండోసారి తన ప్రతాపాన్ని చూపెడుతోంది. మొదటిసారి కరోనా విరుచుకుపడినపుడు ఎటువంటి కష్టాలు వచ్చాయో అటువంటి కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. ముఖ్యంగా రెక్కాడితే కానీ, డొక్కాడని కష్ట జీవులకు మళ్ళీ తిప్పలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో తీవ్రంగా పెరిగిపోతున్న కరోనా కేసులతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అక్కడకు వచ్చి జీవనోపాధి పొందుతున్నవారు వీధిన పడ్డారు. వివిధ రాష్ట్రాల నుంచి ముంబయి పనులకోసం వేలాదిగా వలస వెళతారు. వారంతా అక్కడ రోజువారి వేతనాలపై పనులు చేస్తుకుంటూ జీవనం వెళ్ళబుచ్చుతారు. ఇప్పుడు అక్కడ లాక్ డౌన్ విధించడంతో వారంతా ఏమీ పాలుపోక తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.

మొదటిసారి లాక్ డౌన్ విధించిన తరువాత దాదాపుగా అందరూ తమ ఊర్లకు వెళ్ళిపోయారు. వాళ్ళలో చాలా మంది మళ్ళీ పరిస్థితులు మారుతున్నాయని తిరిగి వచ్చారు. వారంతా మళ్ళీ తిరుగుప్రయాణం పట్టారు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ముంబై నుండి లక్నోకు వచ్చిన వేసవి ప్రత్యేక రైళ్ళ ద్వారా 2.5 నుండి 3 లక్షల మధ్య వలస కూలీలు వచ్చినట్టు ఒక రైల్వే అధికారి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, చివరి లాక్డౌన్లో 5 లక్షలకు పైగా వలసదారులు ముంబై నుండి తిరిగి వచ్చారు. అంటే వారిలో దాదాపు సగానికి పైగా మళ్ళీ తిరిగి వచ్చారు.

బీహార్‌కు వేలాది మంది ప్రయాణికులు..

మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ నుండి బీహార్ లోని వివిధ నగరాలకు 64 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇవి కాకుండా బీహార్‌లోని వివిధ నగరాల్లో 31 రైళ్లు స్టేషన్ల గుండా వెళుతున్నాయి. పాట్నా నుండి బయలుదేరే రాజధాని స్పెషల్ కూడా నడుస్తోంది. అటువంటి పరిస్థితిలో, వేలాది మంది ప్రవాసులు పెద్ద నగరాల నుండి తిరిగి వస్తున్నారు.

కష్టతరంగా పరిస్థితి..

వస్తున్న రైళ్లన్నీ ప్పూర్తిగా నిండిపోయి వస్తుండటం.. వచ్చిన వారికి కరోనా పరీక్షలు చేసేందుకు అవకాశం కుదరడం లేదు. లక్నో స్టేషన్ లో పరిస్థితి చూస్తె.. ఆదివారం ఇక్కడకు వచ్చిన ఢిల్లీ నుంచి ఇక్కడకు వచ్చిన రైలులో వచ్చిన వారికి పరీక్షలు చేసే అవకాశం లేకుండా పోయింది. ఎగ్జిట్ గేట్ వద్ద నలుగురు ఆరోగ్య బృందం ఉంది. వీటిలో 2 థర్మల్ స్కానింగ్ మరియు ఒకటి యాంటిజెన్ పరీక్ష కోసం సిద్ధంగా ఉంచారు. అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో ఉన్నందున, స్కానింగ్ సరిగా జరగలేదు. 10-15 నిమిషాల్లో కేవలం 3 మందికి మాత్రమే యాంటిజెన్ పరీక్ష వచ్చింది. స్టేషన్‌లో అంబులెన్స్ కూడా లేదు. అదేవిధంగా అక్కడ ప్రయాణీకులు బయటకు వచ్చే సమయంలో సామాజిక దూరం పాటించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.

పారిపోతున్నారు..

ఇంకా విషాదకరమైన పరిస్థితి ఏమిటంటే.. పట్టణాల్లో పనిచేయడానికి వెళ్లి.. కరోనా లాక్ డౌన్ కారణంగా వెనక్కి వస్తున్నవారు.. తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం. వీరంతా.. క్వారంటైన్ చేస్తారేమో అని భయపడి వారు వచ్చిన రైలు స్టేషన్ లోకి రాకముందే రైలు నుంచి దూకి పారిపోతున్నారు. ఇప్పుడు ఇది ఆయా రాష్ట్రాల్లో పెద్ద తలనొప్పిగా మారింది.

ఆశాభావం..

పాట్నాకు చేరుకున్న కొంతమంది ఇప్పుడు లాక్ డౌన్ పరిస్థితి వచ్చినా మాకు ఇబ్బంది ఉండకపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ గోధుమల హార్వెస్టింగ్ సమయం. రెండు నెలలు మాకు ఇక్కడ కనీసం పని దొరికే అవకాశం ఉంది. ఆ తరువాత పరిస్థితులు ఎలానూ అనుకూలిస్తాయి. అప్పుడు తిరిగి ముంబాయి వెళ్ళిపోతాం అని చెబుతున్నారు. మరి కొంతమంది మాత్రం.. ఎన్నిసార్లు ఇలా వచ్చీ వెళ్ళడం చేయగలం.. మేం ఇక వెళ్ళం. కలో గంజో తాగి మా ఊళ్లలోనే ఉంటాం. కనీసం బ్రతికైనా ఉండగలుగుతాం అని చెబుతున్నారు.

మొత్తమ్మీద ముంబయి లాక్ డౌన్ మళ్ళీ వలస జీవులకు కష్టాలను తెచ్చింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతున్న రైళ్ళు అన్నీ.. పూర్తిగా నిండిపోయే వెళుతున్నాయి. గత లాక్ డౌన్ లో ఆడుకున్న సోనూ సూద్ కూడా ఈసారి స్వయంగా కరోనాతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ వలస జీవులను ఆదుకునేవరెవరు?

Also Read: Delhi Lock Down: లాక్ డౌన్ విధించడంతో వైన్ షాపుల వద్ద ఎగబడ్డ మందుబాబులు!

Manmohan To PM Modi: కరోనా మహమ్మారి కట్టడికి మాజీ ప్రధాని మన్మోహన్ పలు సూచనలతో ప్రధాని మోడీకి లేఖ