Manmohan To PM Modi: కరోనా మహమ్మారి కట్టడికి మాజీ ప్రధాని మన్మోహన్ పలు సూచనలతో ప్రధాని మోడీకి లేఖ

Manmohan To PM Modi: కరోనా మహమ్మారి కట్టడికి మాజీ ప్రధాని మన్మోహన్ పలు సూచనలతో ప్రధాని మోడీకి లేఖ
Modi

Manmohan Singh:దేశంలో రోజు రోజుకీ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మాజీ ప్రధాన మంత్రి.. ఆర్ధిక రంగ నిపుణులు మన్ మోహన్ సింగ్ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి...

Surya Kala

|

Apr 19, 2021 | 5:28 PM

Manmohan Singh:దేశంలో రోజు రోజుకీ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మాజీ ప్రధాన మంత్రి.. ఆర్ధిక రంగ నిపుణులు మన్ మోహన్ సింగ్ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి పలు సూచనలు చేస్తూ ఓ లేఖను రాశారు. కరోనా నియంత్రణకు తీసుకొనే చర్యలతో పాటు .. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగవంతం చేయాలనీ కోరారు.. తన సలహాలు.. సూచనలను నిర్మాణాత్మక సహకార స్ఫూర్తితో స్వీకరించాలని చెప్పారు. ప్రపంచం వ్యాప్తంగా కరోనా మహమ్మారితో పోరాటం ప్రారంభించి ఏడాది దాటిపోయింది. ఇప్పటికే ఎందరో అయినవాళ్ళని పోగొట్టుకున్నారు . ఎవరికీ ఎవరూ కాకుండా ఏకాకిలా బతికే రోజులు వచ్చాయి, తమ రక్తసంబధీకులతో పాటు స్నేహితులను కూడా కలవలేని పరిస్థితిలో ఉన్నారు.. ఇక ఎంతో మంది ఈ కల్లోలానికి తమ జీవనాధారాన్నే కోల్పోయారు. కోట్లాదిమంది పేదరికంలో మగ్గుతున్నారు.

అయితే ఇప్పుడు మళ్ళీ మనం కరోనా సెకండ్ వేవ్ ను చూస్తున్నాం… దీంతో తమ జీవితాల్లోకి మాములు రోజులు ఎప్పుడొస్తాయా అని సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఎదురుచూస్తున్నారు. అని లేఖలో రాసిన మన్మోహన్ సింగ్ మహమ్మారితో పోరాటానికి చేయాల్సిన పనులను కొన్నిటిని సూచించారు.

కరోనా వ్యాక్సిన్ తయారీకి కంపెనీలకు ఇచ్చిన ఆర్దర్ల వివరాలను బహిర్గతం చేయాలని సహించారు. వచ్చే ఆరునెల టార్గెట్ తో వ్యాక్సినేషన్ తయారీకి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి.. ఆర్డర్ ఇస్తే.. కంపెనీలు వాటికీ అనుగుణంగా వ్యాక్సిన్లను సరఫరా చేస్తాయి.

ఇక కరోనా టీకాల పంపిణీని అన్ని రాష్ట్రాలకు ఎలా చేస్తారన్నదీ పారదర్శకంగా ప్రకటించాలి. అయితే కేంద్రం వద్ద అత్యవసరం కోసం 10 శాతం వ్యాక్సీన్ ఉంచొచ్చు. అది కాకుండా మిగిలిన వ్యాక్సిన్లు ఎప్పుడు ఇస్తారనేది రాష్ట్రాలకు చెబితే అవి అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయని తెలిపారు మన్మోహన్ సింగ్.

ఇక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారన్నది రాష్ట్రాలే నిర్ణయించుకునేలా ఉండాలి .

గత కొన్ని దశాబ్దాలుగా భారత్ ప్రపంచంలోనే వ్యాక్సీన్ల తయారీలో ముందుంది. ఈ ఉత్పత్తి సామర్థ్యంలో అత్యధికం ప్రైవేటు చేతుల్లోనే ఉంది. అయితే [ప్రస్తుతం దేశము చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. కనుక అందరూ ప్రభుత్వనికి సహకారం అందించాల్సి ఉంది. వ్యాక్సినేషన్ కోసం కరోనా నివారణ కోసం దేశీయ వ్యాక్సిన్ సరఫరా పరిమితం అయినందున, యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ లేదా యుఎస్‌ఎఫ్‌డిఎ వంటి నమ్మకమైన సంస్థల అనుమతులు పొందిన విదేశీ వ్యాక్సీన్లనూ ఈ అత్యవసర పరిస్థితుల్లో మనం అనుమతించాలని ఆయన సూచించారు. మన దేశంలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ కోసం పట్టుపట్టరాదు. కాదంటే పరిమిత కాలానికే ఈ వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకోవచ్చని ప్రధాని మోడీకి మన్మోహన్ సింగ్ సూచించారు.

తన సలహాలను. సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.

Aslo Read: నాతో పాటు నా పిల్లలకు కూడా కరోనా బారిన పడ్డారు.. జాగ్రత్తగా ఉండమంటూ ఎమోషనల్ పోస్ట్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu