KVD Varma |
Updated on: Apr 19, 2021 | 5:54 PM
దేశ రాజధాని ప్రాంతంలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఆరు రోజుల లాక్‌డౌన్ విధిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో ఇవాళ రాత్రి 10 నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. కరోనా కట్టడి కోసం అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు.
మరోవైపు లాక్‌డౌన్ ప్రకటనతో ఢిల్లీలో మద్యం దుకాణాలకు జనం ఒక్కసారిగా పోటెత్తారు.
పలు చోట్ల భౌతిక దూరం, మాస్కులు ధరించకుండా పెద్దసంఖ్యలో బారులు తీరడం గమనార్హం. మద్యం దుకాణాల నిర్వాహకులు కూడా వారిని నియంత్రించ లేకపోతున్నారు.