Petrol, Diesel price Today: తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు.. ప్రధాన నగరాల్లో స్థిరంగానే..

Petrol, Diesel Rates Today: కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. అన్నిచోట్ల ధరలు స్థిరంగానే

Petrol, Diesel price Today: తెలుగు రాష్ట్రాల్లోనే పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు.. ప్రధాన నగరాల్లో స్థిరంగానే..
petrol diesel price hiked
Follow us

|

Updated on: Apr 28, 2021 | 6:43 AM

Petrol, Diesel Rates Today: దేశంలో నిత్యం పెరిగిన చమురు ధరలకు కొంచెం బ్రేక్ పడుతూ వస్తోంది. దీంతో సామాన్యులకు ఉపశమనం లభించింది. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరినుంచి ఆందోళన వక్తమైంది. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది.

కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. అన్నిచోట్ల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాలు మరికొన్ని చోట్లనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.54 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.04 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 96.01ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.89 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.69 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.22గా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిన్న పెట్రోల్‌ ధర రూ.93.99 కి ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.05 కి చేరింది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.12 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.15గా ఉంది.

Also Read:

Kia Motors Jobs: ఏపీలోని కియా మోటార్స్ లో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి మూడు రోజుల్లో ఇంటర్వ్యూలు

Vakeel Saab: ఓటీటీ లో రానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..