AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మ బాబోయ్..! చైనా మాంజాలే కాదు.. ప్రాణాలు తీస్తున్న కేబుల్‌ వైర్లు.. తస్మాత్ జాగ్రత్త..!

కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుందంట.. అలా ఉంది ఆ పెద్దాయనకు జరిగిన ఘటన చూస్తే..! హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న ఆయన స్కూలుకు బయలుదేరిన కొద్దిసేపటికే విచిత్రంగా మృత్యువాత పడటం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. విధి కాకపోతే ఏంటి..? ఎప్పుడూ వెళ్ళే దారిలో బైక్‌పై వెళుతుంటే కేబుల్‌ వైర్‌ మెడకు చుట్టుకుని అదుపుతప్పి కింద పడిపోవడం ఏంటి... అక్కడికక్కడే తీవ్ర గాయాలై చనిపోవడం ఏంటి..?

అమ్మ బాబోయ్..! చైనా మాంజాలే కాదు.. ప్రాణాలు తీస్తున్న కేబుల్‌ వైర్లు.. తస్మాత్ జాగ్రత్త..!
Cable Wire
Fairoz Baig
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 12:24 PM

Share

కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుందంట.. అలా ఉంది ఆ పెద్దాయనకు జరిగిన ఘటన చూస్తే..! హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న ఆయన స్కూలుకు బయలుదేరిన కొద్దిసేపటికే విచిత్రంగా మృత్యువాత పడటం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. విధి కాకపోతే ఏంటి..? ఎప్పుడూ వెళ్ళే దారిలో బైక్‌పై వెళుతుంటే కేబుల్‌ వైర్‌ మెడకు చుట్టుకుని అదుపుతప్పి కింద పడిపోవడం ఏంటి… అక్కడికక్కడే తీవ్ర గాయాలై చనిపోవడం ఏంటి..?

బాపట్ల జిల్లా చీరాల మండలం దేవినూతాల గ్రామ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బైక్‌ పై ప్రయాణిస్తున్న అంగిరేకుల శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు శ్రీనివాసరావు చీరాల మండలం గవినివారిపాలెంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. బాపట్ల నుండి గవినివారిపాలెంకు పాఠశాలకు ఎప్పటిలాగే విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు. మార్గం మధ్యలో ఫైబర్ కేబుల్ వైరు శ్రీనివాసరావు మెడకు ప్రమాదవశాత్తు తగలడంతో బైక్ అదుపుతప్పి కింద పడి పొలాల్లోకీ దూసుకుపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే శ్రీనివాసరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.