Skill Development Scam: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. ఇందులో వారి ప్రమేయం కూడా ఉందంటూ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోన్న స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా పెద్ద స్కామ్ అని, ఇందులో ప్రముఖ రాజకీయ వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోన్న స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా పెద్ద స్కామ్ అని, ఇందులో ప్రముఖ రాజకీయ వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. కింద స్థాయి వ్యక్తులు ఈ స్కామ్ చేయలేరని, ఈడీ దర్యాప్తులో అసలు విషయం తేలుతుందని సజ్జల తెలిపారు. కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ వ్యవహారంపై నిగ్గుతేల్చడానికి వస్తున్నాయని పేర్కొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో తలపెట్టిన సీమ గర్జన సభలో సజ్జల మాట్లాడారు. ‘ రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. సీమకు ఎవరు ఏం చేశారో ప్రజలే చెబుతారన్నారు. రాయలసీమ డెవలప్ మెంట్ ను చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు.స్కిల్ డెవలెప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఇందులోని లింకులు చంద్రబాబు, లోకేశ్ ల వరకు వెళ్లవచ్చు. సెంట్రల్ ఏజెన్సీలు కూడా విచారణకు చేపట్టడంతో టీడీపీ నాయకులు నోరు తెరవడం లేదు ‘ అని సజ్జల తెలిపారు
కాగా గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని, కోట్లాది రూపాయలు పక్కదారి మళ్లాయన్న ఆరోపణలతో ఈడీ 26 మందికి నోటీసులు జారీ చేశారు. మొత్తం 234 కోట్ల నిధుల మళ్లింపుపై కేసు నమోదు చేసింది. పూణెకి చెందిన పలు సెల్ కంపెనీలను క్రియేట్ చేసి వాటి ద్వారా నిధులు మళ్లింపు జరిగినట్టు ఈడీ తేల్చింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావుతో పాటు మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు నోటీసులు ఇచ్చింది ఈడీ. వీరితోపాటు ఓఎస్‌డీ నిమ్మగడ్డ కృష్ణ ప్రసాదర్‌కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాదులోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.




మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..