Vijayawada Bangalore Expressway: విజయవాడ టూ బెంగళూరు ..12 గంటలు కాదు ఇకపై కేవలం 6 గంటల్లోనే..
విజయవాడ, బెంగళూరు మధ్య ప్రయాణం సాగించే వారికి శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. బెంగళూరు, విజయవాడల మధ్య దూరంగా సుమారు 663 కి.మీలు.. సాధారణంగా 11 గంటల 30 నిమిషాల వరకు సమయం పడుతుంది. కానీ త్వరలో అందుబాటులోకి..

విజయవాడ, బెంగళూరు మధ్య ప్రయాణం సాగించే వారికి శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. బెంగళూరు, విజయవాడల మధ్య దూరంగా సుమారు 663 కి.మీలు.. సాధారణంగా 11 గంటల 30 నిమిషాల వరకు సమయం పడుతుంది. కానీ త్వరలో అందుబాటులోకి రానున్న ఎక్స్‌ప్రెస్‌వేతో ఈ సమయం సగానికి సగం తగ్గనుంది. విజయవాడ – బెంగళూరుల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇప్పటికే బిడ్డింగ్‌లకు ఆహ్వానం అందించింది.
బెంగళూరు – కడప – విజయవాడల మధ్య వెళ్లే ఈ రోడ్డు ద్వారా కేవలం 6 గంటల్లోనే బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లొచ్చు. ఈ ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణాన్ని రూ. 19,200 కోట్లతో చేపట్టనున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ దీనిపై ఇప్పటికే అంగీకారం తెలియజేశారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే భూసేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ ప్రాజెక్ట్‌ను మొత్తం 14 ప్యాకేజీల్లో పూర్తి చేయనున్నారు. వీటిలో 4 ప్రాజెక్టుల కోసం బిడ్స్‌కు ఆహ్వానించారు. మొత్తం నిర్మాణ ఖర్చులో ఎన్‌హెచ్‌ఏఐ 40 శాతం డబ్బులు ఖర్చు చేస్తుండగా, మిగతా 60 శాతం కంట్రాక్టర్స్ ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం భారతమాల పరియోజన్ ఫేస్2 పథకం కింత చేపట్టనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవే కొడికొండ, పులివెందుల, మల్లెపల్లి, వంగపండు, అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు మీదుగా వెళ్లనుంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం పనులు జరిగితే ఈ ఎక్స్‌ప్రెస్ హైవే 2025-2026 నాటికి అందుబాటులోకి రానుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..