AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala Ramakrishna Reddy: ఓట్ల కోసం హామీలిచ్చే పార్టీ మాది కాదు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ సోమవారం ప్రకటిచింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు.

Sajjala Ramakrishna Reddy: ఓట్ల కోసం హామీలిచ్చే పార్టీ మాది కాదు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
Sajjala Ramakrishna Reddy
Shaik Madar Saheb
|

Updated on: Feb 20, 2023 | 5:05 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ సోమవారం ప్రకటిచింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయానికి వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉంది.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవుల్లో పెద్దపీట వేశామని తెలిపారు. బీసీలంటే.. బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ క్లాస్‌.. అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చామన్నారు. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ మాది కాదని.. వారిని అధికారంలో భాగస్వామ్యం చేయడమే తమ కర్తవ్యమన్నారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని తెలిపారు.

టీడీపీ హయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మండలిలో 37 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రం బీసీలకే 43 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని తెలిపారు. సామజిక సాధికారిత అంటే తమదేనని.. చంద్రబాబు మాటలు చెబితే తాము చేతల్లో చూపించామని స్పష్టం చేశారు. చంద్రబాబు హయంలో 62.5 ఓసీలు, 32 శాతం బీసీలు ఉన్నారన్నారు. 87 మున్సిపాలిటీల్లో 84 చోట్ల తమ పార్టీ గెలిచిందని.. 44 మంది మున్సిపల్‌ ఛైర్మన్లు బీసీలే ఉన్నారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, స్థానిక కోటాలో 9 మంది అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో మరో ఇద్దరి పేర్లను సజ్జల ప్రకటించారు. కాగా, 18 స్థానాలకు గాను బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలను కేటాయించినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

స్థానిక సంస్థలు..

  • నర్తు రామారావు.. శ్రీకాకుళం – లోకల్‌ కోటా (బీసీ, యాదవ)
  • కుడుపూడి సూర్యనారాయణ – తూర్పు గోదావరి, లోకల్‌ కోటా (బీసీ-శెట్టి బలిజ)
  • వంకా రవీంద్రనాథ్‌ -పశ్చిమ గోదావరి,‍ లోకల్‌ ​కోటా (పారిశ్రామికవేత్త)
  • కవురు శ్రీనివాస్‌ – పశ్చిమ గోదావరి, లోకల్‌ కోటా( బీసీ-శెట్టి బలిజ)
  • మేరుగ మురళి – నెల్లూరు, లోకల్‌ కోటా (ఎస్సీ-మాల)
  • డా. సిపాయి సుబ్రహ్మణ్యం – చిత్తూరు, లోకల్‌ కోటా
  • రామసుబ్బారెడ్డి – కడప, లోకల్‌ కోటా (ఓసీ-రెడ్డి)
  • డాక్టర్‌ మధుసూదన్‌ – కర్నూలు, లోకల్‌ కోటా (బీసీ-బోయ)
  • ఎస్‌. మంగమ్మ – అనంతపురం, లోకల్‌ కోటా( బీసీ-బోయ)

ఎమ్మెల్యే కోటా..

  • పెనుమత్స సూర్యనారాయణ – విజయనగరం, ఎమ్మెల్యే కోటా (క్షత్రియ సామాజిక వర్గం)
  • పోతుల సునీత – ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి)
  • కోలా గురువులు – విశాఖపట్నం, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌)
  • బొమ్మి ఇ‍జ్రాయిల్‌ – తూర్పు గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ)
  • జయమంగళ వెంకటరమణ, పశ్చిమ గోదావరి, లోకల్‌ కోటా (వడ్డీల సామాజిక వర్గం)
  • ఏసు రత్నం – గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర)
  • మర్రి రాజశేఖర్‌ – గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ)

గవర్నర్ కోటా..

  • కుంభా రవి – అల్లూరి సీతారామరాజు జిల్లా, (ఎస్టీ)
  • కర్రి పద్మశ్రీ – కాకినాడ, (బీసీ)

మరిన్ని ఏపీ వార్తల కోసం..